source: IPL X
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అభిమానులకు నిరాశ కలిగించే వార్త. కాలి గాయం కారణంగా హార్దిక్ ఈ ఏడాదంతా ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరమయ్యే అవకాశముందని ఓ నివేదిక వెల్లడించింది. ఇదే జరిగితే శ్రీలంకతో డిసెంబరులో జరిగే టీ20 సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండడు.
ఐపీఎల్ 2027లోనే పునరాగమనం..?
హార్దిక్ పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత వైద్యుల అనుమతితోనే మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుత అంచనాల ప్రకారం, 2027 ఐపీఎల్ ముందు అతడికి ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించే అవకాశం ఉంది. అదే జరిగితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ దాదాపు ఏడాది పాటు ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది.
హార్దిక్ గాయాన్ని దృష్టిలో ఉంచుకొని ముంబై ఇండియన్స్ అతడికి ప్రత్యామ్నాయం కోసం చూస్తోంది. కెప్టెన్‌గా తిలక్ వర్మ, బుమ్రాలలో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీమిండియాలో హార్దిక్ ప్రత్యామ్నాయంగా ఇదివరకే నితీశ్ కుమార్ రెడ్డిని ప్రమోట్ చేస్తున్నారు. హార్దిక్ గాయం మరింత తీవ్రతరమైతే అతడి కెరీర్ మొత్తానికే ఎండ్ కార్డ్ పడే ప్రమాదముంది.
ఇదీ చదవండి: శుభ్‌మన్ గిల్ సరసన బాబర్ ఆజం.. వన్డేల్లో అరుదైన రికార్డులు


