
రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2025కు ముందు రాయల్స్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్.. కేవలం ఒక్క సీజన్‌కే తన పదవికి రాజీనామా చేశాడు.
అయితే ఫ్రాంచైజీలో అంతర్గత విభేదాల కారణంగా ద్రవిడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. కానీ రాజస్తాన్ మాత్రం అతడు తప్పుకోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడు ద్రవిడ్ తదుపరి అడుగు ఏంటన్న చర్చ క్రికెట్ వర్గాల్లో నెలకొంది.
కేకేఆర్ హెడ్ కోచ్‌గా..
ఐపీఎల్-2026కు ముందు రాహుల్ ద్రవిడ్‌ను తమ జట్టు హెడ్‌కోచ్‌గా నియమించుకోవాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ భావిస్తుందంట. ఈ ఏడాది సీజన్ తర్వాత కేకేఆర్ ప్రధాన కోచ్ పదవి నుంచి చంద్రకాంత్ పండిత్ తప్పుకొన్నాడు. ప్రస్తుతం కేకేఆర్ హెడ్‌కోచ్ పదవి ఖాళీగా ఉంది.
దీంతో అతడి స్ధానాన్నిఅనుభవజ్ఞుడైన ద్రవిడ్‌తో భర్తీ చేయాలని కోల్‌కతా యాజయాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ కరేబియన్ దీవుల నుంచి వచ్చిన వెంటనే ద్రవిడ్‌తో సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది. కానీ ద్రవిడ్ కేకేఆర్ ఆఫర్‌ను అంగీకరిస్తాడో లేదో తెలియదు.
ఎందుకంటే గత ఏడు ఎనిమిదేళ్ల నుంచి వివిధ జట్లకు కోచింగ్ ఇస్తూ ద్రవిడ్ బీజీబీజీగా గడిపాడు. అతడు ప్రస్తుతం తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతో భారత హెడ్‌కోచ్ పదవి నుంచి ద్రవిడ్ తప్పుకొన్నాడు. అయితే కేకేఆర్ అతడికి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఆఫర్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్-2025లో అట్టర్ ప్లాప్..
కాగా ఈ ఏడాది సీజన్‌లో అజింక్య రహానే సారథ్యంలోని కోల్‌కతా జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. కేకేఆర్ 14 మ్యాచ్‌లు ఆడి కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్ధానంలో నైట్‌రైడర్స్ నిలిచింది. కెప్టెన్ రహానేపై కూడా వేటు పడే అవకాశముంది.
చదవండి: Ashes 2025: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. బుమ్రాను ఫాలో కానున్న కమ్మిన్స్!?