
యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అందుబాటులో ఉండకపోవచ్చునని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కమ్మిన్స్ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ తర్వాత కమ్మిన్స్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు.
ఈ క్రమంలోనే విండీస్‌తో టీ20 సిరీస్, సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లకు దూరమయ్యాడు. అయితే నవంబర్ 21 నుండి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ సమయానికి కమ్మిన్స్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం అంచనా వేసింది. కానీ ఊహించిన దానికంటే అతడి వెన్ను నొప్పి తీవ్రంగా ఉన్నట్లు . డైలీ మెయిల్ ప్రకారం.. కమ్మిన్స్ తాజా స్కానింగ్‌లో వెన్ను గాయం తీవ్రత తెలిసినట్లు సమాచారం
బుమ్రా బాటలో..
అయితే కమ్మిన్స్ టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా బాటలో నడిచే అవకాశమున్నట్లు సదరు రిపోర్ట్ పేర్కొంది. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో కమ్మిన్స్‌ను రెండు లేదా మూడు టెస్టులు మాత్రమే ఆడించాలని ఆసీస్ సెలక్టర్లు భావిస్తున్నరంట. బుమ్రా సైతం ఇటీవలే ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో కూడా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్ భాగంగా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కమ్మిన్స్ విషయంలో కూడా అదే జరగొచ్చు.
కాగా కమ్మిన్స్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్, భారత్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. మరి కొద్ది రోజుల్లో కమ్మిన్స్ ఫిట్‌నెస్‌పై పూర్తి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇది ఇలా ఉండగా.. కమ్మిన్స్ ఈ ఏడాది ఆరంభం నుంచి ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. అయినప్పటికి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల్లోనూ ఈ స్టార్ పేసర్ పాల్గొన్నాడు. ఆ తర్వాత ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్, వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లోనూ కమ్మిన్స్ భాగమయ్యాడు.
2025-26 యాషెస్ సిరీస్ తేదీలు:
పెర్త్ టెస్ట్ (వెస్ట్ టెస్ట్): పెర్త్ స్టేడియం | నవంబర్ 21-25
బ్రిస్బేన్ టెస్ట్ (డే/నైట్ టెస్ట్): గబ్బా | డిసెంబర్ 4-8
అడిలైడ్ టెస్ట్ (క్రిస్మస్ టెస్ట్): అడిలైడ్ ఓవల్ | డిసెంబర్ 17-21
మెల్బోర్న్ టెస్ట్ (బాక్సింగ్ డే టెస్ట్): | డిసెంబర్ 26-30
సిడ్నీ టెస్ట్ (నూతన సంవత్సర టెస్ట్): ఎస్‌సీజీ | జనవరి 4-8
చదవండి: IND vs AUS: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టులో పాసైన కెప్టెన్