breaking news
Austrlaia
-
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. బుమ్రాను ఫాలో కానున్న కమ్మిన్స్!?
యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అందుబాటులో ఉండకపోవచ్చునని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కమ్మిన్స్ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ తర్వాత కమ్మిన్స్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే విండీస్‌తో టీ20 సిరీస్, సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లకు దూరమయ్యాడు. అయితే నవంబర్ 21 నుండి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ సమయానికి కమ్మిన్స్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం అంచనా వేసింది. కానీ ఊహించిన దానికంటే అతడి వెన్ను నొప్పి తీవ్రంగా ఉన్నట్లు . డైలీ మెయిల్ ప్రకారం.. కమ్మిన్స్ తాజా స్కానింగ్‌లో వెన్ను గాయం తీవ్రత తెలిసినట్లు సమాచారంబుమ్రా బాటలో.. అయితే కమ్మిన్స్ టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా బాటలో నడిచే అవకాశమున్నట్లు సదరు రిపోర్ట్ పేర్కొంది. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో కమ్మిన్స్‌ను రెండు లేదా మూడు టెస్టులు మాత్రమే ఆడించాలని ఆసీస్ సెలక్టర్లు భావిస్తున్నరంట. బుమ్రా సైతం ఇటీవలే ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో కూడా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్ భాగంగా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కమ్మిన్స్ విషయంలో కూడా అదే జరగొచ్చు.కాగా కమ్మిన్స్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్, భారత్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. మరి కొద్ది రోజుల్లో కమ్మిన్స్ ఫిట్‌నెస్‌పై పూర్తి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇది ఇలా ఉండగా.. కమ్మిన్స్ ఈ ఏడాది ఆరంభం నుంచి ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. అయినప్పటికి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల్లోనూ ఈ స్టార్ పేసర్ పాల్గొన్నాడు. ఆ తర్వాత ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్, వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లోనూ కమ్మిన్స్ భాగమయ్యాడు.2025-26 యాషెస్ సిరీస్ తేదీలు:పెర్త్ టెస్ట్ (వెస్ట్ టెస్ట్): పెర్త్ స్టేడియం | నవంబర్ 21-25బ్రిస్బేన్ టెస్ట్ (డే/నైట్ టెస్ట్): గబ్బా | డిసెంబర్ 4-8అడిలైడ్ టెస్ట్ (క్రిస్మస్ టెస్ట్): అడిలైడ్ ఓవల్ | డిసెంబర్ 17-21మెల్బోర్న్ టెస్ట్ (బాక్సింగ్ డే టెస్ట్): | డిసెంబర్ 26-30సిడ్నీ టెస్ట్ (నూతన సంవత్సర టెస్ట్): ఎస్సీజీ | జనవరి 4-8చదవండి: IND vs AUS: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్నెస్ టెస్టులో పాసైన కెప్టెన్ -
శ్రీలంకతో ఆస్ట్రేలియా తొలి టి20.. మ్యాక్స్‌వెల్ మాయ చేస్తాడా..?
ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు కొలంబోలో నేడు జరిగే తొలి టి20 మ్యాచ్‌లో శ్రీలంక జట్టుతో తలపడుతుంది. వార్నర్, మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, స్టార్క్, స్మిత్, లబుషేన్, హాజల్‌వుడ్‌లతో ఆస్ట్రేలియా పటిష్టంగా కనిపిస్తోంది. ఆసీస్–శ్రీలంక మధ్య జరిగే మూడు టి20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లకు టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తామని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. శ్రీలంకతో తొలి టీ20కి ఆస్ట్రేలియా తుది జట్టు(SL Vs AUS: Australia Playing XI For 1st T20I) ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), ఆష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, జోష్ హాజిల్‌వుడ్. శ్రీలంక జట్టు దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, కుసల్ మెండిస్, భానుక రాజపక్స(వికెట్ కీపర్), దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, రమేష్ మెండిస్, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, లహిరు మధుశంక, ప్రవేణ్ శంకన్, ప్రవేణ్ శంకన్, కసున్ రజిత, జయవిక్రమ, నువానీడు ఫెర్నాండో, మతీషా పతిరన, నువాన్ తుషార చదవండి: 'హార్ధిక్ పాండ్యా ఇద్దరి ఆటగాళ్లతో సమానం.. అయితే వన్డేల్లో మాత్రం ఆడకూడదు' -
యువీకి వీరాభిమానిని: మాజీ చీఫ్ సెలక్టర్
దుబాయ్: ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో స్థానం కోల్పోయి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ మద్దతుగా నిలిచారు. భారత క్రికెట్ జట్టులో యువరాజ్ సింగ్ లాంటి క్రికెటర్ ఉండటం దేవుడిచ్చిన వరంగా సందీప్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ యువీకి తానొక వీరాభిమానిగా ఉన్నానంటూ స్పష్టం చేసిన సందీప్ పాటిల్.. ఇకపై కూడా అతనికే వీరాభిమానిగా ఉండాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. వచ్చే వరల్డ్ కప్ కు యువరాజ్ సింగ్ జట్టులో ఉంటారా? అన్న ప్రశ్నకు సందీప్ సమాధాన్ని దాటవేశారు. ఆ సమయానికి ఎవరు జట్టులో ఉంటారనేది వారి ఫిట్‌నెస్‌పై ఆధారపడి వుంటుందన్నారు. కాగా, యువీకి తిరిగి భారత జట్టులోకి వచ్చే సత్తా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. యువరాజ్ మళ్లీ జట్టులో చోటు సంపాదిస్తాడనే ఆశాభావాన్ని సందీప్ వ్యక్తం చేశారు. 2019కి చాలా సమయం ఉన్నందున యువరాజ్ చోటుపై తానేమీ స్పష్టత ఇవ్వలేనన్నారు. అదే సమయంలో టీమిండియా సెలక్టర్ గా తాను లేననే విషయం గుర్తు పెట్టుకోవాలని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.