
అఫ్గానిస్తాన్ క్రికెట్(Afghanistan) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాక్ సరిహద్దులోని తూర్పు పాక్తిక ప్రావిన్స్‌లో పాకిస్తాన్(Pakistan) సైన్యం జరిపిన బాంబు దాడిలో ముగ్గురు అఫ్గాన్ దేశవాళీ క్రికెటర్లు మృతి చెందారు. ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది.
అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రకారం.. ఆటగాళ్లు తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ నుండి షరానాకు ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది. మృతి చెందిన క్రికెటర్లను కబీర్, సిబాతుల్లా, హరూన్‌గా గుర్తించారు. ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి తిరిగి వస్తుండగా పాక్ సైనం కృరత్వానికి వారు బలై అయిపోయారు.
ఈ దాడిలో క్రికెటర్లతో మరో ఐదుగురు అఫ్గాన్ పౌరులు సైతం ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడి కారణంగా నవంబర్‌లో శ్రీలంక-పాకిస్తాన్‌తో జరిగాల్సిన ట్రై సిరీస్ నుంచి అఫ్గానిస్తాన్ తప్పుకొంది.
"ఈ హృదయ విదారక ఘటనలో ఉర్గున్ జిల్లాకు చెందిన మా ముగ్గురు ఆటగాళ్లు కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్‌లను కోల్పోయాము. ఉర్గున్ కు తిరిగి వచ్చాక ఓ సమావేశంలో ఈ దాడి జరిగింది. ఇది పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన పిరికి పంద చర్య. మా క్రికెటర్లతో పాటు మరో ఐదుగురు అఫ్గాన్ పౌరులు మృతి చెందారు.
వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. బాధితులకు గౌరవ సూచకంగా నవంబర్ చివరలో జరగనున్న పాకిస్తాన్‌తో జరగనున్న ముక్కోణపు టీ20 సిరీస్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాము అని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా అక్టోబర్ 11 నుంచి పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత తాలిబాన్లపై పాకిస్తాన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించగా.. ప్రతీకారంగా తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యం ఔట్ పోస్టులపై డ్రోన్ బాంబులతో దాడి చేశారు.
ఇరువైపుల కూడా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది. సీజ్ ఫైర్ ముగిసిన వెంటనే పాక్ మరోసారి తన వక్రబుద్దిని చాటుకుంది.
చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ