
పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్దిని చాటుకుంది. అఫ్గానిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో శుక్రవారం సాయంత్రం పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో మొత్తం 8 మంది మృతి చెందారు. అందులో ముగ్గురు స్థానిక క్రికెటర్లు కూడా ఉన్నారు.
ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు షరానా పట్టణానికి వెళ్లి.. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో పాక్ దుశ్చర్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటనపై అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ స్పందించాడు. పాకిస్తాన్‌పై రషీద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటనను అత్యంత క్రూరమైన చర్యగా అతడు పేర్కొన్నాడు.
"పాకిస్తాన్ జరిపిన దాడిలో పౌరులు, దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సాధారణ ప్రజులు నివసించే ప్రాంతాలను టార్గెట్ చేసి దాడి చేయడం ఒక క్రూరమైన చర్య. ఇటువంటి చట్టవిరుద్ధమైన చర్యలు మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘనను సూచిస్తాయి.
పాకిస్తాన్‌తో జరగబోయే మక్కోణపు సిరీస్ నుంచి వైదొలగాలనే ఏసీబీ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా నిలవాలనుకుంటున్నాను. దేశమే అన్నింటికంటే ముందు అని రషీద్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. అదేవిధంగా మహ్మద్ నబీ, రెహ్మతుల్లా గుర్భాజ్ వంటి స్టార్ క్రికెటర్లు కూడా తమ సంతాపం తెలియజేశారు.
చదవండి: పాకిస్తాన్ దాడి.. ముగ్గురు అఫ్గాన్ క్రికెటర్ల మృతి