
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్ టెస్టులను క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 31న రోహిత్‌కు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో హిట్‌మ్యాన్‌కు యో-యో టెస్టు,బ్రాంకో టెస్టు నిర్వహించారు.
ఈ రెండు టెస్టుల్లోనూ రోహిత్ శర్మ ఉత్తీర్ణత సాధించినట్లు రేవ్ స్పోర్ట్స్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే రోహిత్ స్కోర్‌ను మాత్రం బయటకు వెల్లడించలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రోహిత్ చివరసారిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇప్పటికే టీ20, వన్డేలకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.
ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌లో రోహిత్ ఆడనున్నాడు. అయితే ఈ సిరీస్ తర్వాత రోహిత్ పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని వార్తలు వినిపించాయి. వన్డే ప్రపంచకప్-2027కు ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో రోహిత్, కోహ్లిలు వన్డేల నుంచి తప్పుకొంటారని ప్రచారం జరిగింది.
కానీ ఈ వార్తలను బీసీసీఐ తోసిపుచ్చింది. కాగా రోహిత్ ప్రస్తుతం తన ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి సారించాడు. గతంతో పోలిస్తే రోహిత్ ప్రస్తుతం రోహిత్ చాలా స్లిమ్‌గా, ఫిట్‌గా కన్పిస్తున్నాడు. ఇదే ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తే రాబోయో వన్డే ప్రపంచకప్‌లో ఆడినా ఆశ్చర్యపోన్కర్లేదు. ఆసీస్ పర్యటనకు ముందు హిట్‌మ్యాన్ స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరిగే అనాధికారిక వన్డే సిరీస్‌లో ఆడే అవకాశముంది.
వాళ్లు కూడా పాస్..
రోహిత్ పాటు ఇతర టీమిండియా ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, జితేష్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణలు కూడా తమ ఫిట్‌నెస్ పరీక్షలలో పాసైనట్లు తెలుస్తోంది. వీరిందరిలో పేసర్ ప్రసిద్ద్ కృష్ణ ఎక్కువ స్కోర్ సాధించినట్లు సమాచారం.
కాగా ఆటగాళ్ల శారీరక సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు యో-యో టెస్టుతో పాటు ఎముకల సాంద్రతను తెలుసుకునేందుకు డీఎక్స్ఏ స్కాన్‌ను కూడా నిర్వహించారు. అయితే మరో భారత స్టార్ విరాట్ కోహ్లి తన ఫిట్‌నెస్ టెస్టుకు ఎప్పుడు హాజరవుతాడో ఇంకా స్పష్టత లేదు.
చదవండి: ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు ఆసీస్‌తో టెస్టు మ్యాచ్! సిరాజ్ ఎమన్నాడంటే?