
2026 టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2026) ఆడబోయే 20 జట్లు ఖరారయ్యాయి. చివరి బెర్త్‌ను తాజాగా యూఏఈ (UAE) దక్కించుకుంది. ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్స్‌లో (East Asia Pacific Qualifier) జపాన్‌పై గెలుపుతో యూఏఈ ప్రపంచకప్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇదే రీజియనల్ క్వాలిఫయర్ ద్వారా నిన్ననే ఒమన్, నేపాల్ ప్రపంచకప్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.
భారత్, శ్రీలంక వేదికలుగా వచ్చే ఏడాది జరుగబోయే పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్లపై ఓ లుక్కేద్దాం. ముందుగా ఆతిథ్య హోదాలో భారత్, శ్రీలంక నేరుగా అర్హత సాధించాయి. ఆతర్వాత గత ప్రపంచకప్‌లో (2024) సూపర్-8 దశకు చేరిన 7 జట్లు (ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, యూఎస్‌ఏ) నేరుగా అర్హత సాధించాయి.
ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా పాకిస్తాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లు ప్రపంచకప్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. అమెరికా రీజియనల్ క్వాలిఫయర్ ద్వారా కెనడా అర్హత సాధించింది.
యూరప్ క్వాలిఫయర్స్ ద్వారా నెదర్లాండ్స్, ఇటలీ అర్హత సాధించాయి. అఫ్రికా క్వాలిఫయర్ ద్వారా నమీబియా, జింబాబ్వే క్వాలిఫై అయ్యాయి. చివరిగా ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్ ద్వారా ఒమన్, నేపాల్, యూఏఈ జట్లు ప్రపంచకప్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.
చదవండి: తేలిపోయిన బంగ్లా బ్యాటర్లు.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..?