
టెస్ట్‌ల్లో, వన్డేల్లో ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ అయిన పాట్ కమిన్స్ (Pat Cummins) ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటూ రిహాబ్‌లో ఉన్నాడు. కమిన్స్ జులైలో వెస్టిండీస్ సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఆతర్వాత ఆసీస్ ఆడిన అన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. త్వరలో భారత్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కూడా ఎంపిక కాలేదు. నవంబర్‌లో జరిగే యాషెస్ సిరీస్‌లో తొలి టెస్ట్‌కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు.
అక్టోబర్ 19 నుంచి స్వదేశంలో భారత్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌కు ముందు కమిన్స్ వార్తల్లో నిలిచాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అతన్ని భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లతో కూడిన ఆల్‌టైమ్ వన్డే జట్టును (Cummins All Time India Vs Australia ODI XI) ఎంపిక చేయమని అడిగారు.
కమిన్స్ ఆశ్చర్యకరంగా వన్డేల్లో ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లైన విరాట్ కోహ్లి (Virat kohli), రోహిత్ శర్మను (Rohit Sharma) ఎంపిక చేయలేదు. కమిన్స్ ఛాయిస్‌కు క్రికెట్ అభిమానులంతా షాకయ్యారు. కోహ్లి, రోహిత్‌ను ఎంపిక చేయని కమిన్స్.. భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్, టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ కెప్టెన్ ఎంఎస్ ధోని, భారత క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌ను తన ఆల్‌టైమ్ ఫేవరెట్ వన్డే జట్టుకు ఎంపిక చేశాడు.
ఈ జట్టులో కేవలం ముగ్గురు భారత ఆటగాళ్లకు మాత్రమే చోటు కల్పించిన కమిన్స్.. ఎనిమిది మంది ఆస్ట్రేలియన్లకు అవకాశం ఇచ్చాడు. డేవిడ్ వార్నర్‌ను సచిన్‌కు జోడీగా ఓపెనర్‌గా ఎంపిక చేసిన కమిన్స్.. ఆతర్వాత వరుసగా రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్, మైఖేల్ బెవన్‌కు మిడిలార్డర్‌లో చోటు కల్పించాడు.
వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ధోనికి అవకాశం ఇచ్చిన కమిన్స్.. జహీర్ ఖాన్‌తో పాటు స్పెషలిస్ట్ పేసర్లుగా తన దేశానికే చెందిన గ్లెన్ మెక్‌గ్రాత్, బ్రెట్ లీకు చోటు కల్పించాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా దివంగత షేన్ వార్న్‌ను ఎంపిక చేశాడు.
కమిన్స్ ఆల్‌టైమ్ బెస్ట్ ఇండియా, ఆస్ట్రేలియా మిక్స్‌డ్ వన్డే టీమ్..
డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్, మైఖేల్ బెవాన్, ఎంఎస్ ధోని, షేన్ వార్న్, బ్రెట్ లీ, జహీర్ ఖాన్, గ్లెన్ మెక్‌గ్రాత్
చదవండి: చెలరేగిన షమీ.. భారత సెలెక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్