సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో సచిన్ టెండూల్కర్ తనయుడు, గోవా ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బౌలింగ్‌లో రాణిస్తున్నప్పటికి బ్యాటింగ్‌లో మాత్రం అర్జున్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. గత సీజన్‌లో లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్‌కు ఈసారి గోవా టీమ్ మెనెజ్‌మెంట్ ఏకంగా ఓపెనర్‌గా ప్రమోషన్ ఇచ్చింది.
కెరీర్‌లో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన జూనియర్ టెండూల్కర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 28 పరుగులు చేసిన అర్జున్.. ఆ తర్వాత చండీగఢ్‌పై కేవలం 18 పరుగులతో సరిపెట్టుకున్నాడు.
తాజాగా ఆదివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 బంతులు ఆడి 7 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో కూడా అర్జున్ సత్తాచాటలేకపోయాడు. యూపీపై కూడా అర్జున్ బ్యాట్‌తో పాటు బంతితో కూడా విఫలమయ్యాడు. కానీ చండీగఢ్‌పై మాత్రం 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.
దీంతో గోవా 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మిగితా రెండు మ్యాచ్‌లలో మాత్రం గోవా చిత్తు అయింది. ముంబై నుంచి తన మకాంను గోవాకు మర్చిన అర్జున్ ఇక్కడ కూడా తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. మొన్నటివరకు కేవలం రెడ్ బాల్ క్రికెట్‌కు పరిమితమైన అర్జున్‌కు ఈసారి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆడే అవకాశం దక్కింది.
కానీ తనకు దక్కిన అవకాశాన్ని అర్జున్ సద్వినియోగ పరుచుకోలేకపోతున్నాడు. కాగా ఐపీఎల్-2026లో అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడనున్నాడు. మినీ వేలానికి ముందు అర్జున్‌ను ముంబై ఇండియన్స్ నుంచి లక్నో ట్రేడ్ చేసుకుంది.
చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా


