సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 ఆరంభానికి ముందు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దేశవాళీ టోర్నీ కోసం తమ జట్టు కెప్టెన్‌గా ఓపెనింగ్ బ్యాటర్ పృథ్వీ షాను ఎంసీఎ నియమించింది. కాగా ఎంసీఎ రెండు రోజుల క్రితం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది.
వాస్తవానికి రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర జట్టుకు సారథ్యం వహించాల్సి ఉండేది. కానీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు రుతురాజ్‌ను భారత సెలక్టర్లు పిలుపునివ్వడంతో అతడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ క్రమంలో మహారాష్ట్ర కెప్టెన్ మార్పు అనివార్యమైంది.
ఎంసీఎ సెలక్టర్లు ఇప్పటికే తమ నిర్ణయాన్ని షాకు తెలియజేసినట్లు సమాచారం. ఈ విషయంపై మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సోమవారం(నవంబర్ 24) అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పృథ్వీ షాకు కెప్టెన్‌గా అనుభవం ఉంది.
గతంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్‌లో ముంబై జట్టుకు పలు మ్యాచ్‌లలో సారథ్యం వహించాడు. కాగా రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌కు ముందు పృథ్వీ తన మకాంను ముంబై నుంచి మహారాష్ట్రకు మార్చిన సంగతి తెలిసిందే. ముంబై క్రికెట్ అసోయేషిన్‌తో విబేధాలు కారణంగా షా మహారాష్ట్రకు వచ్చాడు.
ముంబై నుండి మహారాష్ట్రకు మారినప్పటి నుంచి పృథ్వీ షా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో షా 7 ఇన్నింగ్స్‌లు ఆడి 67.14 సగటుతో 470 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. మహారాష్ట్ర అదే రోజున తమ తొలి మ్యాచ్‌లో జమ్మూ అం‍్డ్ కాశ్మీర్‌తో తలపడనుంది.
మహారాష్ట్ర జట్టు
రుతురాజ్ గైక్వాడ్, నిఖిల్ నాయక్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, రామకృష్ణ ఘోష్, రాజవర్ధన్ హంగర్గేకర్, జలజ్ సక్సేనా, అజీమ్ కాజీ, అర్షిన్ కులకర్ణి, ముఖేష్ చౌదరి, విక్కీ ఓస్త్వాల్, ప్రశాంత్ సోలంకి, మందార్ భండారి, యోగేష్ డోంగరే, యోగేష్ డోంగరే


