
పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు వెళ్లింది. ఇందులో భాగంగా ఆదివారం (అక్టోబరు 19)నాటి మ్యాచ్‌తో తొలుత వన్డే సిరీస్‌కు తెరలేస్తుంది. అనంతరం ఆసీస్- భారత్ (IND vs AUS) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు ముహూర్తం ఖరారైంది.
ఇందుకోసం ఇప్పటికే టీమిండియా- ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్, మ్యాచ్ వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందాం!
ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా వన్డే సిరీస్ షెడ్యూల్
🏏తొలి వన్డే: అక్టోబరు 19 (ఆదివారం)- పెర్త్ స్టేడియం, పెర్త్
🏏రెండో వన్డే: అక్టోబరు 23 (గురువారం)- అడిలైడ్ ఓవల్, అడిలైడ్
🏏మూడో వన్డే: అక్టోబరు 25 (శనివారం)- సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ
👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం ఆసీస్- భారత్ వన్డే మ్యాచ్‌లు ఉదయం 9 గంటలకు ఆరంభం
ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్
🏏తొలి టీ20: అక్టోబరు 29 (బుధవారం)- మనుకా ఓవల్, కాన్‌బెర్రా
🏏రెండో టీ20: అక్టోబరు 31 (శుక్రవారం)- మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్‌బోర్న్
🏏మూడో టీ20: నవంబరు 2 (ఆదివారం)- బెలిరివ్ ఓవల్, హోబర్ట్
🏏నాలుగో టీ20: నవంబరు 6 (గురువారం)- బిల్ పిప్పెన్ ఓవల్, గోల్డ్ కోస్ట్
🏏ఐదో టీ20: నవంబరు 8 (శనివారం)- ది గాబా, బ్రిస్బేన్.
👉మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.45 నిమిషాలకు టీ20 మ్యాచ్‌లు ఆరంభం.
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..
👉జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం
👉టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్స్‌లో ప్రసారం
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.
భారత్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, మార్నస్ లబుషేన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్‌షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.
భారత్‌తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టు (తొలి రెండు మ్యాచ్‌లకు మాత్రమే)
మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.