
ఐపీఎల్-2025లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ దారుణ ప్రదర్శన కరబరిచింది. అజింక్య రహానే సారథ్యంలో బరిలోకి దిగిన కేకేఆర్.. అందరి అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఈ టోర్నీలో వరుస ఓటములతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి కేకేఆర్ నిష్క్రమించింది.
ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లలో సైతం కేకేఆర్ చేతులేత్తేసింది. ముఖ్యంగా వేలంలో రూ.23.75 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వెంకటేశ్ అయ్యర్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ ఏడాది సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన అయ్యర్.. 20.28 సగటుతో కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు.
అయితే వేలంలో కేకేఆర్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ సూచన మేరకే వెంకటేశ్ అయ్యర్‌పై ఫ్రాంచైజీ యాజమాన్యం అంత భారీ ధర వెచ్చించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో చంద్రకాంత్ కేకేఆర్ మెనెజ్‌మెంట్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది సీజన్ తర్వాత ప్రధాన కోచ్‌గా అతడిపై వేటు వేయాలని కోల్‌కతా ఫ్రాంచైజీ భావిస్తోందంట. చంద్రకాంత్ పండిట్ స్ధానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ను తమ ప్రధాన కోచ్‌గా నియమించేందుకు కేకేఆర్ ఆసక్తిచూపుతున్నట్లు సమాచారం. ఇయాన్ మోర్గాన్‌తో కేకేఆర్‌కు మంచి అనుబంధం ఉంది. మోర్గాన్ కెప్టెన్‌గా 2021 సీజన్‌లో కేకేఆర్‌ను ఐపీఎల్ ఫైనల్స్‌కు చేర్చాడు.
అయితే ఫైనల్‌లో మాత్రం సీఎస్‌కే చేతిలో నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. అదేవిధంగా మెంటార్‌గా ఉన్న డ్వైన్ బ్రావోను కూడా తొలిగించే యోచనలో కేకేఆర్ ఉన్నట్లు సమాచారం. నైట్‌రైడర్స్‌కు ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. మే 25న ఢిల్లీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
చదవండి: IPL 2025: ఎస్ఆర్‌హెచ్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా