ఐపీఎల్‌లో అట్ట‌ర్ ప్లాప్‌.. క‌ట్ చేస్తే! ఆ జ‌ట్టు కెప్టెన్‌గా వెంక‌టేశ్ అయ్యర్‌? | Venkatesh Iyer set To Captain Pink Panthers In MPL 2025 | Sakshi
Sakshi News home page

MPL 2025: ఐపీఎల్‌లో అట్ట‌ర్ ప్లాప్‌.. క‌ట్ చేస్తే! ఆ జ‌ట్టు కెప్టెన్‌గా వెంక‌టేశ్ అయ్యర్‌?

Jun 9 2025 8:17 PM | Updated on Jun 9 2025 8:24 PM

Venkatesh Iyer set To Captain Pink Panthers In MPL 2025

PC: BCCI/IPL.com

మధ్యప్రదేశ్‌ లీగ్‌(MPL) రెండో ఎడిష‌న్‌కు స‌ర్వం సిద్ద‌మైంది. ఈ ఏడాది ఎంపీఎల్ సీజ‌న్ జూన్ 12 నుంచి  ప్రారంభం కానుంది. అయితే తొలి ఎడిష‌న్‌లో కేవ‌లం ఐదు జ‌ట్లు మాత్ర‌మే పోటీ ప‌డ‌గా.. ఇప్పుడు మ‌రో రెండు ఫ్రాంచైజీలు ఇండోర్ పింక్ పాంథ‌ర్స్‌, చంబల్ ఘరియల్స్‌ కొత్త‌గా చేరాయి.

ఈ టోర్నీలో ఫ్రాంచైజీ ఇండోర్ పింక్ పాంథ‌ర్స్‌తో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ వెంక‌టేశ్ అయ్య‌ర్ జ‌త‌క‌ట్టాడు. గ‌త సీజ‌న్‌లో గ్వాలియర్ చీతాస్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన అయ్య‌ర్‌.. ఇప్పుడు పింక్ పాంథ‌ర్స్‌కు ఆడ‌నున్నాడు.

అంతేకాకుండా త‌మ జ‌ట్టు కెప్టెన్సీని వెంక‌టేశ్ అయ్య‌ర్‌కు అప్ప‌గించాల‌ని పాంథ‌ర్స్ యాజ‌మాన్యం భావిస్తోంది. అత‌డి ఎంపిక‌పై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశ‌ముంది. ఎంపీఎల్‌-2024లో 8 మ్యాచ్‌ల‌లో 58.57 స‌గ‌టుతో 480 ప‌రుగులు చేశాడు.

ఐపీఎల్‌-2025లో ఫెయిల్‌..
కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌లో మాత్రం వెంక‌టేశ్ అయ్య‌ర్ తీవ్ర‌నిరాశ‌ప‌రిచాడు. ఐపీఎల్ చరిత్ర‌లో అత్యంత ఖ‌రీదైన మూడో ఆట‌గాడిగా నిలిచిన అయ్య‌ర్.. ఏ మాత్రం త‌న ధ‌ర‌కు న్యాయం చేయలేక‌పోయాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో అయ్య‌ర్‌ను రూ.23.75 కోట్ల భారీ ధ‌ర‌కు కేకేఆర్ కొనుగోలు చేసింది.  సీజ‌న్ మొత్తంలో  అతడు 11 మ్యాచ్‌లలో 7 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడి, 142 పరుగులు చేశాడు. మిగిలిన రెండు మ్యాచ్‌ల‌కు బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు.
చదవండి: WTC final: 'చోకర్స్ ట్యాగ్‌ను చెరిపేయాలి'.. సౌతాఫ్రికాకు బౌచర్‌ పిలుపు
 

Advertisement
 
Advertisement
Advertisement