breaking news
Madhya Pradesh Cricket Association
-
అభిషేక్ విధ్వంసం.. 33 బంతుల్లోనే సెంచరీ! 15 సిక్స్‌లతో
మధ్యప్రదేశ్ లీగ్ (MPL) 2025లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరాభిమాని అభిషేక్ పాఠక్ విధ్వంసం సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం వేదికగా జబల్పూర్ రాయల్ లయన్స్, బుందేల్‌ఖండ్ బుల్స్ జట్లు తలపడ్డాయి.ఈ మ్యాచ్‌లో బుందేల్‌ఖండ్ బుల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అభిషేక్ పాఠక్.. కేవలం 33 బంతుల్లో సెంచరీ చేసి అందరని ఆశ్చర్యపరిచాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అభిషేక్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు.అతడిని ఆపడం ఎవరిని తరం కాలేదు. అభిషేక్ ఓవరాల్‌గా 48 బంతుల్లో15 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 133 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ కరణ్ తహిలియానితో కలిసి మొదటి వికెట్‌కు 178 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన బుందేల్‌ఖండ్ బుల్స్ 246 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో జబల్పూర్ జట్టు 227 పరుగులకే పరిమితమైంది. దీంతో 19 పరుగుల తేడాతో బుందేల్‌ఖండ్ విజయం సాధించింది."నేను 13 ఏళ్ల వయస్సు నుంచి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. ఇప్పటివరకు అండర్-16, అండర్-19, అండర్-23 స్దాయిలో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాను. అంతేకాకుండా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఆడాను నా ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొన్నాను.నేను ఈ స్దాయికి చేరుకోవడానికి మద్దతుగా నిలిచిన నా తల్లిదండ్రులకు, నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. సూర్యకుమార్ యాదవ్ అంటే నాకు ఎంతో ఇష్టం. సూర్యకుమార్ యాదవ్ లాగా స్థిరత్వం నేర్చుకోవాలనుకుంటున్నాను. ఆ దిశగా నేను నిరంతరం కృషి చేస్తున్నాను" అని మ్యాచ్ అనంతరం అభిషేక్ పాఠక్ పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్.. 229 పరుగులు చేశాడు.వైభవ్ సూర్యవంశీ రికార్డు బ్రేక్..ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన అభిషేక్ పాఠక్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యంతవేగవంతమైన సెంచరీ చేసిన మూడో ఇండియన్ క్రికెటర్‌గా అభిషేక్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరిట ఉండేది. ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్‌పై సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో సూర్యవంశీ రికార్డును పాఠక్ బ్రేక్ చేశాడు.టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ప్లేయర్లు వీరేఉర్విల్ పటేల్- 28 బంతులుఅభిషేక్ శర్మ- 28 బంతులురిషబ్ పంత్- 32 బంతులుఅభిషేక్ పాఠక్-33 బంతులువైభవ్ సూర్యవంశీ- 35 బంతులు View this post on Instagram A post shared by SportsTiger (@sportstiger_official) -
ఐపీఎల్లో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే! ఆ జట్టు కెప్టెన్‌గా వెంకటేశ్ అయ్యర్?
మధ్యప్రదేశ్ లీగ్(MPL) రెండో ఎడిషన్‌కు సర్వం సిద్దమైంది. ఈ ఏడాది ఎంపీఎల్ సీజన్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. అయితే తొలి ఎడిషన్‌లో కేవలం ఐదు జట్లు మాత్రమే పోటీ పడగా.. ఇప్పుడు మరో రెండు ఫ్రాంచైజీలు ఇండోర్ పింక్ పాంథర్స్, చంబల్ ఘరియల్స్ కొత్తగా చేరాయి.ఈ టోర్నీలో ఫ్రాంచైజీ ఇండోర్ పింక్ పాంథర్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ జతకట్టాడు. గత సీజన్లో గ్వాలియర్ చీతాస్‌కు ప్రాతినిథ్యం వహించిన అయ్యర్.. ఇప్పుడు పింక్ పాంథర్స్‌కు ఆడనున్నాడు.అంతేకాకుండా తమ జట్టు కెప్టెన్సీని వెంకటేశ్ అయ్యర్‌కు అప్పగించాలని పాంథర్స్ యాజమాన్యం భావిస్తోంది. అతడి ఎంపికపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఎంపీఎల్-2024లో 8 మ్యాచ్‌లలో 58.57 సగటుతో 480 పరుగులు చేశాడు.ఐపీఎల్-2025లో ఫెయిల్..కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం వెంకటేశ్ అయ్యర్ తీవ్రనిరాశపరిచాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన మూడో ఆటగాడిగా నిలిచిన అయ్యర్.. ఏ మాత్రం తన ధరకు న్యాయం చేయలేకపోయాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో అయ్యర్‌ను రూ.23.75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. సీజన్ మొత్తంలో అతడు 11 మ్యాచ్‌లలో 7 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడి, 142 పరుగులు చేశాడు. మిగిలిన రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు.చదవండి: WTC final: 'చోకర్స్ ట్యాగ్‌ను చెరిపేయాలి'.. సౌతాఫ్రికాకు బౌచర్ పిలుపు -
మహిళా క్రికెటర్ ను వేధించిన బోర్డు అధికారిపై కేసు
పద్దెనిమిదేళ్ల మహిళా క్రికెటర్ పై ఓ క్రికెట్ అసోసియేషన్ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే వార్త క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) ప్రధాన కార్యదర్శి అల్పేష్ షాపై లైంగిక వేధింపుల పాల్పడ్డారని మహిళా క్రికెటర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎంపీసీఏ ప్రధాన కార్యదర్శి నిర్వాకంపై తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తనపై కేసు నమోదైందనే విషయం తెలుసుకున్న షా గురువారమే తన పదవికి రాజీనామా చేశారు. హోల్కర్ పరిపాలన భవనంలో సెప్టెంబర్ 23 తేదిన ప్రత్యేకంగా ఆశీస్సులు అందిస్తానని పిలిచి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. షా ఎంపీసీఏ అండర్-19 క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటికి కన్వీనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అండర్ 19 జట్టుకు ఎంపిక చేయలేదనే కోపంతోనే ఆరోపణలకు పాల్పడుతుందని మాజీ ఎంపీసీఏ ప్రధాన కార్యదర్శి అన్నారు. చట్టబద్దమైన లాంచనాలను పూర్తి చేసిన తర్వాతనే అతనిపై చర్య తీసుకుంటామని తుకోగంజ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జీ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ వ్యవహారంపై వాస్తవాలను తెలుసుకోవడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఇంద్రాణి దత్తా పర్యవేక్షణలో ఓ కమిటిని నియమించారు.