వారెవ్వా ర‌హానే.. కళ్లు చెదిరే క్యాచ్‌! వీడియో వైర‌ల్‌ | Ajinkya Rahane takes screamer to remove Vaibhav Suryavanshi | Sakshi
Sakshi News home page

IPL 2025: వారెవ్వా ర‌హానే.. కళ్లు చెదిరే క్యాచ్‌! వీడియో వైర‌ల్‌

May 4 2025 7:01 PM | Updated on May 4 2025 7:04 PM

Ajinkya Rahane takes screamer to remove Vaibhav Suryavanshi

PC: BCCI/IPL.com

ఐపీఎల్ 2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కెప్టెన్ అజింక్య ర‌హానే సంచ‌ల‌న క్యాచ్‌తో మెరిశాడు. ర‌హానే అద్భుత క్యాచ్‌తో రాజ‌స్తాన్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీని పెవిలియ‌న్‌కు పంపాడు.

తొలి ఓవ‌ర్ వేసిన వైభ‌వ్ ఆరోరా.. నాలుగో బంతిని షార్ట్ బాల్ సంధించాడు. ఆ బంతిని  వైభవ్ సూర్యవంశీ పుల్ షాట్ కోసం ప్ర‌య‌త్నించాడు. షాట్ స‌రిగ్గా క‌న‌క్ట్ కాక‌పోవ‌డంతో బంతి మిడ్-వికెట్ వైపు గాల్లోకి లేచింది. ఈ క్ర‌మంలో మిడ్ వికెట్‌లో ఉన్న ర‌హానే ప‌రిగెత్తుకుంటూ వెళ్లి చివరి వరకు బంతిపై దృష్టికోల్పోకుండా అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. 

దీంతో 4 పరుగులు చేసిన సూర్యవంశీ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో రస్సెల్‌ 25 బంతుల్లో 57 టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. కెప్టెన్‌ అజింక్య రహానే (24 బంతుల్లో 30), అంగ్‌క్రిష్‌ రఘువన్షీ (31 బంతుల్లో 44) రాణించారు. రాజస్తాన్‌ బౌలర్లలో మహీశ్‌ తీక్షణ, రియాన్‌ పరాగ్‌, జోఫ్రా ఆర్చర్‌, యుధ్‌వీర్‌ సింగ్‌ చరక్‌ ఒక్కో వికెట్‌ తీశారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement