
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ అనుహ్యా ఓటమి చవిచూసింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక కేకేఆర్ చతకలపడింది. కేకేఆర్ లక్ష్య చేధనలో కేవలం 95 పరుగులకే ఆలౌటై ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది.
ఐపీఎల్ చరిత్రలో ప్రత్యర్ధి జట్టు డిఫెండ్ చేసుకున్న అత్యల్ప టార్గెట్ ఇదే. పంజాబ్ బౌలర్లలో స్పిన్నర్ చాహల్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు మార్కో జానెసన్ మూడు.. మాక్స్‌వెల్, బ్రాట్‌లెట్, అర్ష్‌దీప్ తలా వికెట్ సాధించారు. కేకేఆర్ బ్యాటర్లలో కేకేఆర్ బ్యాటర్లలో రఘువన్షి(37) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా చేతులేత్తేశారు.
నరైన్ అరుదైన రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ మాత్రం ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో ఒకే జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నరైన్ చరిత్ర సృష్టించాడు. పంజాబ్ కింగ్స్‌పై నరైన్ ఇప్పటివరకు 36 వికెట్లు పడగొట్టాడు.
పంజాబ్ ఆటగాడు మార్కో జాన్సెన్‌ను చేసి ఈ రికార్డును తన ఖాతాలో సునీల్ వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత వెటరన్ పేసర్ ఉమేష్ యాదవ్ పేరిట ఉండేది. ఉమేష్ కూడా పంజాబ్ కింగ్స్‌పై 35 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో యాదవ్ అల్‌టైమ్ రికార్డును నరైన్ బ్రేక్ చేశాడు.
ఐపీఎల్‌లో ఒక జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
36 - సునీల్ నరైన్ vs పంజాబ్ కింగ్స్
35 - ఉమేష్ యాదవ్ vs పంజాబ్ కింగ్స్
33 - డ్వేన్ బ్రావో vs ముంబై ఇండియన్స్
33 - మోహిత్ శర్మ vs ముంబై ఇండియన్స్
33 - యుజ్వేంద్ర చాహల్ vs కేకేఆర్
32 - యుజ్వేంద్ర చాహల్ vs పంజాబ్
32 - భువనేశ్వర్ కుమార్ vs కేకేఆర్