
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వాఖండే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలోనే చేధించింది.
ముంబై బ్యాటర్లలో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(40 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖరిలో సూర్యకుమార్ యాదవ్(7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. రోహిత్ శర్మ(13) మరోసారి నిరాశపరిచాడు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు.
నాలుగేసిన అశ్వినీ..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. ముంబై ఇండియన్స్ బౌలర్ల దాటికి కేవలం 16.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో అరంగేట్ర పేసర్ అశ్వినీ కుమార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. దీపక్ చాహర్ రెండు, బౌల్ట్, శాంట్నర్, హార్దిక్, విఘ్నేష్ తలా వికెట్ సాధించారు. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(26) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: IPL 2025: ఐపీఎల్ అరంగేట్రంలోనే సరికొత్త చరిత్ర.. ఎవరీ అశ్వినీ కుమార్?