
Photo Courtesy: BCCI/IPL
ఐపీఎల్-2025లో తొలి హాఫ్ సెంచరీ నమోదైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. తొలి ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన రహానే.. ఆరంభం నుంచే ఆర్సీబీ బౌలర్లపై విరుచుపడ్డాడు.
తనదైన శైలిలో స్టైల్లో షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రహానే కేవలం 25 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 31 బంతులు ఎదుర్కొన్న రహానే.. 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.
రహానే అరుదైన రికార్డు..
కాగా ఈ మ్యాచ్‌తో రహానే ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే మూడు ఫ్రాంచైజీలకు సారథిగా వ్యవహరించిన తొలి భారత ఆటగాడిగా రహానే రికార్డులకెక్కాడు. రహానే తొలిసారిగా 2017 ఐపీఎల్ సీజన్‌లో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ (RPS) జట్టుకు సారథిగా వ్యవహరించాడు.
ఆ తర్వాత ఐపీఎల్-2019లో రాజస్తాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించిన రహానే.. ఇప్పుడు మళ్లీ కేకేఆర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. దీంతో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఐపీఎల్-2025లో మెగా వేలంలో రహానేను కేవలం రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి రౌండ్‌లో అమ్ముడుపోని రహానే ఆఖరి రౌండ్‌లో కేకేఆర్ సొంతం చేసుకుంది.
Proud of You My Man Sir AJINKYA RAHANE 🥹❤️🫡 pic.twitter.com/VeNXSmW2n1
— Malay 🇮🇳❤ (@malay_chasta) March 22, 2025