
PC: BCCI/IPL.com
Punjab kings vs Kolkata Knight Riders Live Updates:
పంజాబ్ కింగ్స్ సంచలన విజయం..
ఐపీఎల్-2025లో ముల్లాన్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో కేకేఆర్ చతకలపడింది. పంజాబ్ బౌలర్ల దాటికి 15. 1 ఓవర్లలో కేవలం 95 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టి కేకేఆర్ పతనాన్ని శాసించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 పరుగులిచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు అర్ష్‌దీప్, మార్కో జానెసన్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచారు. జానెసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్, మాక్స్‌వెల్, బ్రాట్‌లెట్ తలా వికెట్ సాధించారు.
చాహల్ మ్యాజిక్.. కష్టాల్లో కేకేఆర్
స్వల్ప లక్ష్య చేధనలో కేకేఆర్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోతుంది. 76 పరుగులకే కేకేఆర్ 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజులో రస్సెల్(1), హర్షిత్ రాణా(1) ఉన్నారు. కేకేఆర్ విజయానికి 48 బంతుల్లో 35 పరుగులు కావాలి.
కేకేఆర్ మూడో వికెట్ డౌన్..
రహానే రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన రహానే.. చహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి వెంకటేశ్ అయ్యర్ వచ్చాడు.
దూకుడుగా ఆడుతున్న రఘువన్షి, రహానే..
6 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజులో రఘువన్షి(31), రహానే(13) ఉన్నారు.
రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్..
112 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌లో జాన్సెన్ బౌలింగ్‌లో సునీల్ నరైన్(5) క్లీన్ బౌల్డ్ కాగా.. రెండో ఓవర్‌లో బ్రాట్‌లెట్ బౌలింగ్‌లో డికాక్(2) ఔటయ్యాడు.
చెలరేగిన కేకేఆర్ బౌలర్లు.. 111 పరుగులకే పంజాబ్ ఆలౌట్
ఐపీఎల్-2025లో ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లు చేలరేగారు. కేకేఆర్ బౌలర్ల దాటికి పంజాబ్ 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు నోకియా, వైభవ్ ఆరోరా చెరో వికెట్ సాధించారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్(30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(22), శశాంక్ సింగ్(18) కాస్త ఫర్వాలేదన్పించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(0), గ్లెన్ మాక్స్‌వెల్(7) తీవ్ర నిరాశపరిచారు.
పీకల్లోతు కష్టాల్లో పంజాబ్ కింగ్స్..
86 పరుగులకే పంజాబ్ కింగ్స్ 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 11 ఓవర్ వేసిన సునీల్ నరైన్.. తొలి బంతికి గ్లెన్ మాక్స్‌వెల్ క్లీన్ బౌల్డ్ కాగా, ఆఖరి బంతికి మార్కో జానెసన్ క్లీన్ బౌల్డయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 8 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.
పవర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు..
పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలోనే నాలుగో వికెట్ కోల్పోయింది. జోష్ ఇంగ్లిష్(2) వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా.. ఫ్రబ్‌సిమ్రాన్ సింగ్(30) హర్షిత్ రాణా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 4 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది.
పంజాబ్‌కు షాక్.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
ప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన ఆర్య.. హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత అదే ఓవర్‌లో నాలుగో బంతికి శ్రేయస్ అయ్యర్ ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి పంజాబ్ 39 పరుగులు చేసింది.
దూకుడుగా ఆడుతున్న కేకేఆర్..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో ఆర్య(16), ప్రభుసిమ్రాన్ సింగ్(17) ఉన్నారు.
ఐపీఎల్-2025లో బ్లాక్ బాస్టర్ మ్యాచ్‌కు సమయం అసన్నమైంది. ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది.
మార్కస్ స్టోయినిష్, లాకీ ఫెర్గూసన్ స్ధానాల్లో జోష్ ఇంగ్లిష్, బెర్ట్‌లట్ వచ్చాడు. వీరిద్దిరికి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. కేకేఆర్ కూడా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. కేకేఆర్ కూడా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. మోయిన్ అలీ స్ధానంలో అన్రిచ్ నోర్జే వచ్చాడు.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, జోష్ ఇంగ్లిస్, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, అన్రిచ్ నార్టే, వరుణ్ చక్రవర్తి