హెడ్‌కోచ్ గంభీర్‌తో శ్రేయస్ అయ్యర్ (PC: BCCI)
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది టీమిండియా. మిగిలిన రెండు నామమాత్రపు మ్యాచ్‌లలోనూ గెలిచి.. ప్రపంచకప్ టోర్నీకి ముందు మరోసారి సత్తా చాటాలని సూర్య సేన పట్టుదలగా ఉంది.
మరోవైపు.. ఐసీసీ ఈవెంట్‌కు ముందు టీమిండియాను ఒక్కసారైన నిలువరించి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. ఈ క్రమంలో విశాఖపట్నం వేదికగా బుధవారం ఇరుజట్లు నాలుగో టీ20 (IND vs NZ 4th T20I)లో తలపడనున్నాయి.
ఇక ఇప్పటికే టీమిండియా ఈ సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో.. వరల్డ్‌కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో పాటు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇచ్చే యోచనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యా స్థానంలో..
ఈ క్రమంలో చాన్నాళ్లుగా టీమిండియా తరఫున టీ20లలో పునరాగమనం చేయాలన్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కల నెరవేరే అవకాశం లేకపోలేదు. హార్దిక్ పాండ్యా స్థానంలో అతడు తుదిజట్టులోకి వస్తాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమైనా సంజూ శాంసన్‌కు మరొక్క అవకాశం దక్కనుంది.
సంజూ కూడా సేఫ్
వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడం ఇటు సంజూకు.. అటు శ్రేయస్‌కు సానుకూలాంశంగా మారింది. తిలక్ స్థానంలో శ్రేయస్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు.. ఓపెనర్‌గా సంజూ విఫలం కావడం.. అదే సమయంలో మరో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర ఆట తీరుతో ఆకట్టుకోవడంతో సంజూ స్థానం ప్రమాదంలో పడింది.
ఇషాన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తే..
ఒకవేళ తిలక్ నాలుగో టీ20తో తిరిగి వస్తే ఇషాన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేసి సంజూను తుదిజట్టు నుంచి తప్పించే అవకాశం ఉండేది. అయితే, ఇప్పటికి ఆ ప్రమాదం తప్పింది. తిలక్ లేకపోవడం వల్ల ఇలా సంజూ సేఫ్ కాగా.. హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చే శ్రేయస్ అయ్యర్‌కు బ్యాట్ పట్టే అవకాశం రావొచ్చు.
ఇక రొటేషన్‌లో భాగంగా బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ తుదిజట్టులోకి రావొచ్చు. అదే విధంగా.. అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకుని కుల్దీప్ యాదవ్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది.
న్యూజిలాండ్‌తో నాలుగో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా/శ్రేయస్ అయ్యర్, శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా/అర్ష్‌దీప్ సింగ్.
చదవండి: T20 WC 2026: పాక్ క్రికెట్‌ని నాశనం చేస్తారా?: పీసీబీపై మాజీల ఫైర్


