IPL 2025 PBKS Vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు | IPL 2025: kolkata knight riders vs punjab kings live updates | Sakshi
Sakshi News home page

IPL 2025 PBKS Vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు

Apr 26 2025 7:11 PM | Updated on Apr 26 2025 11:19 PM

IPL 2025: kolkata knight riders vs punjab kings live updates

PC: BCCI/IPL.com

KKR vs PBKS Live Updates: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ వర్షం కారణంగా ర‌ద్దైంది. కేకేఆర్ ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ ముగిసిన అనంత‌రం వ‌రుణుడు మ్యాచ్‌కు అంత‌రాయం క‌లిగించాడు. ఆ త‌ర్వాత వ‌ర్షం త‌గ్గుముఖం ప‌ట్టడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభ‌మ‌వుతుంద‌ని అంతాభావించారు. కానీ మైదానం సిద్దం చేసే స‌మ‌యానికి వ‌ర్షం మ‌ళ్లీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో  అంపైర్‌లు మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. 

దీంతో ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్ ల‌భించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌(83) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(69), శ్రేయస్ అయ్యర్‌(25) రాణించారు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో వైభ‌వ్ ఆరోరా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, ర‌స్సెల్ త‌లా వికెట్ సాధించారు.
 

మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం
ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించాడు. మ్యాచ్ నిలిచిపోయే స‌మ‌యానికి కేకేఆర్ వికెట్ న‌ష్ట‌పోకుండా 7 ప‌రుగులు చేసింది. 

చెల‌రేగిన పంజాబ్ బ్యాట‌ర్లు.. కేకేఆర్ ముందు భారీ టార్గెట్‌
ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట‌ర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌(83) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(69), శ్రేయస్ అయ్యర్‌(25) రాణించారు.

పంజాబ్ రెండో వికెట్ డౌన్‌..
ప్ర‌భుసిమ్రాన్ సింగ్ రూపంలో పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 83 ప‌రుగుల‌తో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సింగ్‌.. వైభ‌వ్ ఆరోరా బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. 14.3 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోర్‌: 160/2

పంజాబ్ తొలి వికెట్ డౌన్‌..
ప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 69 ప‌రుగులు చేసిన ఆర్య‌.. ర‌స్సెల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి శ్రేయ‌స్ అయ్య‌ర్ వ‌చ్చాడు. 12 ఓవ‌ర్ల‌కు పంజాబ్ వికెట్ న‌ష్టానికి 121 ప‌రుగులు చేసింది. 

11 ఓవ‌ర్లకు పంజాబ్ స్కోర్‌: 112/0
11 ఓవ‌ర్లు ముగిసే స‌రికి పంజాబ్ కింగ్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 112 ప‌రుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య‌(62), ప్ర‌భుసిమ్రాన్ సింగ్‌(47) ఉన్నారు.

8 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోర్‌: 71/0
8 ఓవ‌ర్లు ముగిసే స‌రికి పంజాబ్ కింగ్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 71 ప‌రుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య‌(38), ప్ర‌భుసిమ్రాన్ సింగ్‌(31) ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న పంజాబ్ కింగ్స్‌..
4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి పంజాబ్ కింగ్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 43 ప‌రుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య‌(28), ప్ర‌భుసిమ్రాన్ సింగ్‌(13) ఉన్నారు.

ఐపీఎల్‌-2025లో ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలంటే ఈ మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు చాలా కీల‌కం.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. జ‌ట్టులోకి తిరిగి మాక్స్‌వెల్‌, ఓమ‌ర్జాయ్ వ‌చ్చారు. కేకేఆర్ రెండు మార్పులు చేసింది. రావ్‌మ‌న్ పావెల్‌తో పాటు చేత‌న్ సాకరియా కేకేఆర్ తుది జ‌ట్టులోకి ఎంట్రీ ఇచ్చారు.

తుది జ‌ట్లు
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీప‌ర్‌), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్‌), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రోవ్‌మన్ పావెల్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement