33 బంతుల్లో శతకం.. రికార్డుల మోత మోగించిన కివీస్‌ యోధుడు | Finn Allen Breaks many records by his 33 balls hundred against south africa in T20 WC 2026 1st semi final | Sakshi
Sakshi News home page

33 బంతుల్లో శతకం.. రికార్డుల మోత మోగించిన కివీస్‌ యోధుడు

Mar 5 2026 7:37 AM | Updated on Mar 5 2026 8:44 AM

Finn Allen Breaks many records by his 33 balls hundred against south africa in T20 WC 2026 1st semi final

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నిన్న (మార్చి 4) జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ సౌతాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి, ఫైనల్‌కు చేరింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ కేవలం​ 12.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. 

ఓపెనర్‌ ఫిన్‌ అల్లెన్‌ బీభత్సమైన సెంచరీతో కివీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. అల్లెన్‌ 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన సెంచరీ చేసి కివీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ సెంచరీతో అల్లెన్‌ రికార్డుల మోత మోగించాడు.

  • టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ.

  • ఓవరాల్‌ టీ20 క్రికెట్‌ చరిత్రలో ఓ ఫుల్‌ మెంబర్‌ జట్టుపై ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ.

  • ఓవరాల్‌గా (ఫుల్‌ మెంబర్లు, సభ్య దేశాలు) టీ20ల్లో ఇది మూడో జాయింట్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ.

  • ఓవరాల్‌గా ఓ ఫుల్‌ మెంబర్‌ జట్టు తరఫున సికందర్‌ రజాతో (గాంబియాపై 33 బంతుల్లో శతకం) పాటు జాయింట్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ. 

  • టీ20 ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల చరిత్రలో తొలి శతకం.

  • టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీ.

  • టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌తో (11 ఫోర్లు, 7 సిక్సర్లు) కలిసి ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీ కౌంట్‌ (10 ఫోర్లు, 8 సిక్సర్లు). 

  • ఓ టీ20 వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు-20.

  • టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌ లేదా ఫైనల్స్‌లో కనీసం 30 బంతులు ఆడిన కోటాలో విరాట్‌ కోహ్లితో పాటు అతి తక్కువ డాట్‌ బాల్స్‌ (3). 

  • టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ తరఫున మూడో శతకం (మెక్‌కల్లమ్‌, ఫిలిప్‌).

ఈ ఇన్నింగ్స్‌తో అల్లెన్‌ మరిన్ని చిన్నా చితకా రికార్డులను కూడా బ్రేక్‌ చేసి న్యూజిలాండ్‌ను ప్రపంచకప్‌ కల సాకారం చేసే దిశగా తీసుకెళ్లాడు. 2021 ఎడిషన్‌ తర్వాత న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరడం​ ఇదే మొదటిసారి. 

ఆ ఎడిషన్‌లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఎదుర్కొని తృటిలో ప్రపంచ ఛాంపియన్‌ అయ్యే అవకాశాన్ని కోల్పోయిన కివీస్‌కు మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచకప్‌ సాధించే అవకాశం వచ్చింది. భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య ఇవాళ జరిగే రెండో సెమీఫైనల్‌ విజేతతో న్యూజిలాండ్‌ తమ తొలి ప్రపంచకప్‌ టైటిల్‌ కోసం పోరాడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement