CSK Vs KKR: సునీల్ నరైన్ అరుదైన ఫీట్‌.. రెండో బౌల‌ర్‌గా రికార్డు | Sunil Narine Created History Becomes Most Successful Spinner Against CSK In IPL, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

IPL 2025 CSK Vs KKR: సునీల్ నరైన్ అరుదైన ఫీట్‌.. రెండో బౌల‌ర్‌గా రికార్డు

Apr 11 2025 10:15 PM | Updated on Apr 12 2025 11:20 AM

Sunil Narine becomes most successful spinner against CSK in IPL

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఆల్‌రౌండ‌ర్ సునీల్ న‌రైన్ బంతితో మ్యాజిక్ చేశాడు. త‌న స్పిన్ మ‌యాజాలంతో సీఎస్‌కే బ్యాట‌ర్ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టాడు. అత‌డిని ఆడ‌టం ఎవ‌రి త‌రం కాలేదు. త్రిపాఠి, ర‌వీంద్ర జ‌డేజా, ధోని వంటి కీల‌క వికెట్ల‌ను ప‌డ‌గొట్టి సీఎస్‌కేను దెబ్బ‌తీశాడు.

న‌రైన్‌ త‌న నాలుగు ఓవ‌ర్ల‌లో కోటాలో కేవ‌లం 13 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఈ క్ర‌మంలో సునీల్ నరైన్ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన రెండో బౌల‌ర్‌గా న‌రైన్ రికార్డులెక్కాడు.

సునీల్ ఇప్ప‌టివ‌ర‌కు చెన్నై జ‌ట్టుపై 26 వికెట్లు సాధించాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు భార‌త మాజీ స్పిన్న‌ర్ హార్బ‌జ‌న్ సింగ్(24) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో భ‌జ్జీ రికార్డును సునీల్ బ్రేక్ చేశాడు.ఈ అరుదైన ఫీట్ న‌మోదు చేసిన జాబితాలో శ్రీలంక దిగ్గ‌జం ల‌సిత్ మ‌లింగ(31) ఉన్నాడు. 

ఐపీఎల్‌లో సీఎస్‌కేపై అత్యధిక వికెట్లు బౌల‌ర్లు వీరే
31 - లసిత్ మలింగ
26 - సునీల్ నరైన్
24 - హర్భజన్ సింగ్ 
22 - పీయూష్ చావ్లా

103 ప‌రుగుల‌కే..
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సీఎస్‌కే.. కేకేఆర్ బౌల‌ర్ల దాటికి 9 వికెట్లు కోల్పోయి కేవ‌లం 103 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో శివ‌మ్ దూబే(31 నాటౌట్‌) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. విజ‌య్ శంక‌ర్‌(29) కాస్త ఫ‌ర్వాలేద‌న్పించాడు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో సునీల్ న‌రైన్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. హ‌ర్షిత్ రానా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌లా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు వైభ‌వ్ ఆరోరా, మోయిన్ అలీ త‌లా వికెట్ సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement