ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్‌ను కేకేఆర్ నియమించింది. ఈ విషయాన్ని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ధ్రువీకరించారు.
గత సీజన్‌లో హెడ్‌కోచ్‌గా పనిచేసిన చంద్రకాంత్ పండిట్ స్థానాన్ని నాయర్ భర్తీ చేయనున్నాడు. "అభిషేక్ నాయర్ 2018 నుంచి కేకేఆర్ సెటాప్‌లో భాగంగా ఉన్నాడు. ఎంతో మంది మా ఆటగాళ్లను అభిషేక్ తీర్చిదిద్దాడు. హెడ్ కోచ్‌గా అతడు మా జట్టును విజయ పథంలో నడిపిస్తాడని ఆశిస్తున్నామని" వెంకీ మైసూర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా నాయర్ 2018 నుంచి కేకేఆర్ బ్యాక్ రూమ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు. అంతకుముందు కేకేఆర్ అకాడమీలో యువ ఆటగాళ్లను తాయారు చేయడంలో అతడు కీలక పాత్ర పోషించాడు.
నాయర్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. భారత జట్టు సహాయక కోచ్‌గా కూడా నాయర్ పనిచేశాడు. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ కారణంగా అసిస్టెంట్ కోచ్‌లపై వేటు వేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో నాయర్ తన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఐపీఎల్-2025లో కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు కేకేఆర్ జట్టు ప్రధాన కోచ్‌గా కూడా అతడు బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. కాగా నాయర్ ఇటీవలే డబ్ల్యూపీఎల్ జట్టు యూపీ వారియర్స్ హెడ్ కోచ్‌గా కూడా ఎంపికయ్యాడు.


