
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఆగస్టు నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా సిరాజ్ ఎంపికయ్యాడు. గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్బుత ప్రదర్శనకు గాను సిరాజ్‌కు ఈ అవార్డు దక్కింది.
ముఖ్యంగా ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో సిరాజ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఓటమి తప్పదనుకున్న చోట సిరాజ్ తన సూపర్ స్పెల్‌తో భారత్‌కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో టీమిండియా సమం చేసింది.
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో సిరాజ్(23) లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అంతేకాకుండా సిరాజ్ సిరీస్ మొత్తంగా 1000 పైగా బంతులను బౌలింగ్ చేసి తన ఫిట్‌నెస్ ఎంటో చాటిచెప్పాడు.
ఇక ఈ ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు కోసం న్యూజిలాండ్‌కు చెందిన మాట్ హెన్రీ, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్ పోటీ పడ్డారు. కానీ వీరిద్దరికంటే సిరాజ్ మెరుగైన ప్రదర్శన చేయడంతో ఈ ఐసీసీ అవార్డు లభించింది.
సిరాజ్ ఈ అవార్డును తన సహచరులకు, సహాయక సిబ్బందికి అంకితం చేశాడు. దేశం కోసం మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాను సిరాజ్ పేర్కొన్నాడు. సిరాజ్ తిరిగి విండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో భారత్ తరపున ఆడనున్నాడు. అక్టోబర్ 2 నుంచి భారత్-వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.
చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా