
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది. ఆదివారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో భారత్ పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో టాపార్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు ప్రతీక రావల్ (96 బంతుల్లో 64; 6 ఫోర్లు), స్మృతి మంధాన (63 బంతుల్లో 58; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్లీన్ డియోల్ (57 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు.
ఆ్రస్టేలియా బౌలర్లలో మేగన్ షుట్ 2 వికెట్లు తీయగా, కిమ్ గార్త్, అనాబెల్, అలానా కింగ్, తాలియా తలా ఒక వికెట్ సాధించారు. అనంతరం ఈ భారీ లక్ష్యాన్ని ఆసీస్ 44.1 ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. . ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (80 బంతుల్లో 88; 14 ఫోర్లు), బెత్ మూనీ (74 బంతుల్లో 77 నాటౌట్; 9 ఫోర్లు), అనాబెల్ సదర్లాండ్ (51 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు) ధాటిగా ఆడారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా చెరో వికెట్ తీశారు. 17న రెండో వన్డే కూడా ఇదే వేదికపై జరుగుతుంది.
చరిత్ర సృష్టించిన ప్రతీక రావల్..
ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైనప్పటికి స్టార్ ఓపెనర్ ప్రతీక రావల్ మాత్రం వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే క్రికెట్‌తో తొలి 15 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ప్రతీక చరిత్ర సృష్టించింది. ఆమె ఇప్పటివరకు భారత తరపున 15 వన్డేలు ఆడి 767 పరుగులు చేసింది.
ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ పేరిట ఉండేది. లానింగ్ తన వన్డే కెరీర్‌లో తొలి మ్యాచ్‌లలో 707 పరుగులలు చేసింది. తాజా మ్యాచ్‌తో లానింగ్ ఆల్‌టైమ్ రికార్డును రావల్ బ్రేక్ చేసింది. వీరిద్దరి తర్వాత స్ధానంలో ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ షార్లెట్ ఎడ్వర్డ్స్(655) మూడో స్ధానంలో ఉంది.
చదవండి: ఏడ్చేసిన షోయబ్ అక్తర్..! కాస్తైనా బుద్ధి లేదంటూ ఫ్యాన్స్ ఫైర్