రెచ్చగొట్టిన మహ్మద్ సిరాజ్‌.. ఇచ్చిపడేసిన ఇంగ్లండ్ బ్యాటర్‌! వీడియో | Mohammed Siraj Loses Cool, Engages In War Of Words With England Star | Sakshi
Sakshi News home page

IND vs ENG: రెచ్చగొట్టిన మహ్మద్ సిరాజ్‌.. ఇచ్చిపడేసిన ఇంగ్లండ్ బ్యాటర్‌! వీడియో

Jun 23 2025 10:20 AM | Updated on Jun 23 2025 11:16 AM

Mohammed Siraj Loses Cool, Engages In War Of Words With England Star

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బౌలింగ్ చేసేటప్పుడు తన మాటలతో, చేష్టలతో ప్రత్యర్ధి బ్యాటర్లను రెచ్చగొడుతూ ఉంటాడు. తాజాగా సిరాజ్ మియా మరోసారి తన చర్యలతో వార్తల్లో నిలిచాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో సిరాజ్ తన సహనాన్ని కోల్పోయాడు. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌తో ఈ హైదరాబాదీ  వాగ్వాదానికి దిగాడు. 

ఇంగ్లం‍డ్ సెకెండ్ ఇన్నింగ్స్ 84వ ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో బ్రూక్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. ఆ తర్వాతి బంతిని సిరాజ్ షర్ప్ ఇన్‌స్వింగర్‌గా సంధించాడు. ఆ బంతిని ఆడడానికి హ్యారీ ఇబ్బందిపడ్డాడు. ఈ క్రమంలో బ్రూక్ వైపు సిరాజ్ సీరియస్ లూక్ ఇచ్చాడు. అంతేకాకుండా అతడిని ఏదో మాట అన్నాడు.

అందుకు బదులుగా బ్రూక్‌.. బౌలింగ్ వేసేందుకు రన్ ఆప్ మార్క్ చేసుకో అంటూ సమాధనమిచ్చాడు. బ్రూక్‌ను రెచ్చగొట్టి ఔట్ చేయాలన్న సిరాజ్ వ్యూహాం  ఫలించలేదు. 86వ ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌ను బ్రూక్ ఓ ఆట ఆడేసికున్నాడు. ఆ ఓవర్‌లో సిరాజ్ ఏకంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ దురదృష్టవశాత్తూ 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. టీమిండియా ప్రస్తుతం 96 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.


 

 

Advertisement
 
Advertisement
Advertisement