
PC: DPL
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా మరోసారి అనుచిత ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. బౌలింగ్‌లోనే కాదూ.. బ్యాటర్లకు సెండాఫ్ ఇవ్వడంలోనూ మరోమారు దూకుడు ప్రదర్శించి మూల్యం చెల్లించాడు. అసలేం జరిగిందంటే.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 (DPL 2025)లో లోకల్ కుర్రాడు హర్షిత్ రాణా నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
అర్జున్ ధనాధన్
ఈ టీ20 ఫార్మాట్ లీగ్‌లో భాగంగా నార్త్ ఢిల్లీ సోమవారం రాత్రి వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టుతో తలపడింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సార్థక్ రంజన్ (33 బంతుల్లో 42) జట్టు తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. అర్జున్ రాప్రియా విలువైన ఇన్నింగ్స్ (22 బంతుల్లో 40) ఆడాడు.
హృతిక్ షోకేన్ మెరుపు హాఫ్ సెంచరీ వృథా
ఇక వెస్ట్ ఢిల్లీ బౌలర్లలో మయాంక్ గసైన్ (3/2) అత్యుత్తమంగా రాణించగా.. శుభమ్ దూబే కూడా (2/26) కూడా రెండు వికెట్లు కూల్చాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వెస్ట్ ఢిల్లీ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో నార్త్ ఢిల్లీ జయభేరి మోగించింది. దీంతో హృతిక్ షోకేన్ మెరుపు హాఫ్ సెంచరీ (24 బంతుల్లో 51) వృథాగా పోయింది.
నార్త్ ఢిల్లీ తరఫున దీపాన్షు గులియా (3/44) అత్యుత్తమ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. వెస్ట్ ఢిల్లీ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్లో నార్త్ ఢిల్లీ కెప్టెన్ హర్షిత్ రాణా బంతితో రంగంలో దిగాడు. అద్భుత డెలివరీతో ఆయుశ్ దోసాంజేను బౌల్డ్ చేశాడు.
వెళ్లు.. వెళ్లు’’ అన్నట్లుగా వేలు ఊపుతూ
ఈ క్రమంలో పెవిలియన్‌కు వెళ్లేందుకు సిద్ధమైన ఆయుశ్‌ను చూస్తూ.. ‘‘వెళ్లు.. వెళ్లు’’ అన్నట్లుగా వేలు ఊపుతూ సంజ్ఞ చేశాడు. ఈ నేపథ్యంలో హర్షిత రాణా చర్యను తీవ్రంగా పరిగణించిన డీపీఎల్ యాజమాన్యం అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది.
డీపీఎల్ ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం.. భాష, చర్యలు, ఇతరులను రెచ్చగొట్టే విధంగా సైగలు వంటివి నేరం. ఇందులోని లెవల్ 1 తప్పిదానికి పాల్పడినట్లు హర్షిత్ రాణా మ్యాచ్ రిఫరీ ముందు అంగీకరించాడు. ఫలితంగా అతడి ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు డీపీఎల్ యాజమాన్యం తెలిపింది.
కాగా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడిన సమయంలోనూ హర్షిత్ రాణా ఇలాగే అతి చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ మయాంక్ అగర్వాల్‌ను అవుట్ చేయగానే ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ ఓవరాక్షన్ చేసి.. మూల్యం చెల్లించాడు.
చదవండి: శుభవార్త పంచుకున్న హసీన్ జహాన్.. షమీపై మరోసారి తీవ్రమైన ఆరోపణలు
Bails are broken — Harshit Rana was there 🥶#DPL2025pic.twitter.com/VDnk39INji
— KKR Karavan (@KkrKaravan) August 11, 2025