breaking news
Arun Jaitley Stadium
-
వైభవ్‌కు చాన్స్ దక్కేనా!
న్యూఢిల్లీ: సమష్టి ప్రదర్శనతో అఫ్గానిస్తాన్‌పై వరుస మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి... సిరీస్ పట్టేసిన టీమిండియా చివరి మ్యాచ్‌లో రిజర్వ్ బలాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టి20ల్లో గెలిచిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే 2–0తో సిరీస్ కైవసం చేసుకుంది. గురువారం ఇరు జట్ల మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో చివరి టి20 మ్యాచ్ జరగనుంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచి లక్ష్యఛేదనకు మొగ్గుచూపిన టీమిండియా... ఈసారి అవకాశం వస్తే మొదట బ్యాటింగ్ చేస్తూ తమ బలాన్ని సరిచూసుకోవాలని భావిస్తోంది. అలాగే రిజర్వ్ ప్లేయర్లను ఈ మ్యాచ్‌లో పరీక్షించే అవకాశాలున్నాయి. మరోవైపు అఫ్గానిస్తాన్ జట్టు ఎంత పోరాడినా గత రెండు మ్యాచ్‌ల్లో టీమిండియాకు సరైన పోటీనివ్వలేకపోయింది. ముగ్గురు ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉన్నా... వారి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. రెండో టి20లో రషీద్ ఖాన్ చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకోవడం ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశం. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్‌తో పాటు గుర్బాజ్, సాధిఖుల్లా, నైబ్, డార్విష్, అజ్మతుల్లా, నబీ కలిసి కట్టుగా రాణించాల్సిన అవసరముంది. గత రెండు మ్యాచ్‌ల మాదిరిగానే పిచ్ బ్యాటింగ్‌కు సహకరించనుంది. ఆటకు వర్షం ఆటంకం కలిగించే అవకాశలు పెద్దగా లేవు. భిన్నమైన కూర్పుతో... ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా చూడాలి. రెండో మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ... చివరి పోరులో భిన్నమైన కూర్పును ప్రయత్నిస్తామని వెల్లడించాడు. ఏషియన్ గేమ్స్ ప్రారంభానికి ముందు ప్లేయర్లందరికీ తగినంత మ్యాచ్ టైమ్ దక్కాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్ చెరో మ్యాచ్‌లో హాఫ్‌సెంచరీలు బాదిన నేపథ్యంలో ఎవరి స్థానంలో సూర్యవంశీని తీసుకుంటారనేది ఆసక్తికరం. ఇంగ్లండ్, జింబాబ్వేలో అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన వైభవ్... సొంతగడ్డపై ఇంతవరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. ఇటీవలి కాలంలో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా నిలకడగా రాణిస్తున్న ఇషాన్‌కు విశ్రాంతినిస్తారా చూడాలి. బౌలర్లకు మరింత వెసులుబాటు కల్పించేందుకు అదనపు బౌలర్‌ను పరీక్షించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అదే జరిగితే బ్యాటింగ్ ఆర్డర్లో ఓ ప్లేయర్ తగ్గనున్నాడు. దీంతో పేస్ ఆల్‌రౌండర్, ఆంధ్ర ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌పై బ్యాటింగ్ భారం పెరగనుంది. బౌలింగ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతుండగా... అర్ష్ దీప్ సింగ్ అతడికి అండగా నిలుస్తున్నాడు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలనుకుంటే యశ్ ఠాకూర్‌కు మరోసారి అవకాశం దక్కొచ్చు. గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్‌కు దూరం కాగా... అతడి స్థానంలో అవకాశం దక్కించుకున్న రవి బిష్ణోయ్ రెండో మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా... ఫీల్డింగ్‌లో మాత్రం టీమిండియా మరింత మెరుగవ్వాల్సిన అవసరముంది. భారత జట్టుతో జపాన్ రాయబారి భేటీ ఈనెల 22న సానో ఇంటర్నేషనల్ స్టేడియంలో జపాన్ జట్టుతో భారత జట్టు తొలిసారి టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బుధవారం భారత్‌లో జపాన్ రాయబారి ఒనో కెచీ బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్‌తో పాటు భారత క్రికెటర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్‌కు జపాన్‌లో అదృష్ట చిహ్నానికి ప్రతీకగా భావించే ‘దారుమా’ బొమ్మను ప్రదానం చేశారు. తుది జట్లు (అంచనా) భారత్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సామ్సన్, అభిషేక్, ఇషాన్/వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, అక్షర్, నితీశ్ రెడ్డి, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, అర్ష్ దీప్, బుమ్రా. అఫ్గానిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), గుర్బాజ్, సాధిఖుల్లా, నైబ్, డారి్వష్, అజ్మతుల్లా, నబీ, రషీద్ ఖాన్, ముజీబ్/నవీన్, ఫజల్హక్ ఫారూఖి. -
క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి.. బీసీసీఐ సంచలన నిర్ణయం!
ప్రపంచ క్రికెట్లో మరో చారిత్రాత్మక ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. భారత్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఆతిథ్యమిచ్చేందుకు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు పావులు కదపుతోంది. ఇదే విషయంపై ఏసీబీ ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, భద్రతా కారణాల వల్ల అక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు ఐసీసీ నుంచి అనుమతి లేదు. దీంతో భారత్‌తో సిరీస్‌ను న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిర్వహించడానికి అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. అఫ్గాన్-భారత్ మధ్య టీ20 సిరీస్ ఈ ఏడాది ఆఖరిలో జరిగే అవకాశముంది."బీసీసీఐ, ఏసీబీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఐర్లాండ్, శ్రీలంక, జింబాబ్వే వంటి ఇతర బోర్డులను ఆర్థికంగా ఆదుకోవడానికి బీసీసీఐ భారత జట్టును అక్కడికి పంపించి మ్యాచ్‌లు ఆడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అఫ్గానిస్తాన్‌కు కూడా భారత క్రికెట్ బోర్డు అండగా నిలవనుంది. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య దైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహణ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుంది. ఈ సిరీస్ కోసం అఫ్ఘనిస్తాన్ జట్టుకు ఢిల్లీని 'హోమ్ గ్రౌండ్' గా కేటాయించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) తో బీసీసీఐ చర్చలు జరిపింది. ఇందుకోసం డీడీసీఏ 'ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20' షెడ్యూల్‌ను కూడా మార్చుకోవడానికి సిద్ధమైందని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఇండియాతో పేర్కొన్నారు. కాగా అఫ్గానిస్తాన్ జట్టు భారత్‌ను తమ హోమ్ గ్రౌండ్‌గా వాడుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలు సిరీస్‌లు ఇండియా వేదికగా జరిగాయి.భారత్‌లో హోంగ్రౌండ్ అఫ్గానిస్తాన్ ఆడిన సిరీస్‌లు2017: ఐర్లాండ్‌తో సిరీస్ (గ్రేటర్ నోయిడా)2018: బంగ్లాదేశ్‌తో సిరీస్ (డెహ్రాడూన్)2024: న్యూజిలాండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ (గ్రేటర్ నోయిడా)ఇక హష్మతుల్లా షాహిదీ నేతృత్వంలోని అఫ్గాన్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో ఏకైక టెస్ట్‌తో మూడు వన్డేల సిరీస్‌లో అఫ్గాన్ తలపడనుంది. జూన్ 6 నుంచి ముల్లాన్‌పూర్ వేదికగా టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. -
టీమిండియా స్టార్ హర్షిత్ రాణాకు షాక్.. ‘ఓవరాక్షన్’కు తప్పదు మూల్యం!
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా మరోసారి అనుచిత ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. బౌలింగ్‌లోనే కాదూ.. బ్యాటర్లకు సెండాఫ్ ఇవ్వడంలోనూ మరోమారు దూకుడు ప్రదర్శించి మూల్యం చెల్లించాడు. అసలేం జరిగిందంటే.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 (DPL 2025)లో లోకల్ కుర్రాడు హర్షిత్ రాణా నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.అర్జున్ ధనాధన్‌ఈ టీ20 ఫార్మాట్ లీగ్‌లో భాగంగా నార్త్ ఢిల్లీ సోమవారం రాత్రి వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టుతో తలపడింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సార్థక్ రంజన్ (33 బంతుల్లో 42) జట్టు తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. అర్జున్ రాప్రియా విలువైన ఇన్నింగ్స్ (22 బంతుల్లో 40) ఆడాడు.హృతిక్ షోకేన్ మెరుపు హాఫ్ సెంచరీ వృథాఇక వెస్ట్ ఢిల్లీ బౌలర్లలో మయాంక్ గసైన్ (3/2) అత్యుత్తమంగా రాణించగా.. శుభమ్ దూబే కూడా (2/26) కూడా రెండు వికెట్లు కూల్చాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వెస్ట్ ఢిల్లీ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో నార్త్ ఢిల్లీ జయభేరి మోగించింది. దీంతో హృతిక్ షోకేన్ మెరుపు హాఫ్ సెంచరీ (24 బంతుల్లో 51) వృథాగా పోయింది.నార్త్ ఢిల్లీ తరఫున దీపాన్షు గులియా (3/44) అత్యుత్తమ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. వెస్ట్ ఢిల్లీ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్లో నార్త్ ఢిల్లీ కెప్టెన్ హర్షిత్ రాణా బంతితో రంగంలో దిగాడు. అద్భుత డెలివరీతో ఆయుశ్ దోసాంజేను బౌల్డ్ చేశాడు.వెళ్లు.. వెళ్లు’’ అన్నట్లుగా వేలు ఊపుతూఈ క్రమంలో పెవిలియన్‌కు వెళ్లేందుకు సిద్ధమైన ఆయుశ్‌ను చూస్తూ.. ‘‘వెళ్లు.. వెళ్లు’’ అన్నట్లుగా వేలు ఊపుతూ సంజ్ఞ చేశాడు. ఈ నేపథ్యంలో హర్షిత రాణా చర్యను తీవ్రంగా పరిగణించిన డీపీఎల్ యాజమాన్యం అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది.డీపీఎల్ ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం.. భాష, చర్యలు, ఇతరులను రెచ్చగొట్టే విధంగా సైగలు వంటివి నేరం. ఇందులోని లెవల్ 1 తప్పిదానికి పాల్పడినట్లు హర్షిత్ రాణా మ్యాచ్ రిఫరీ ముందు అంగీకరించాడు. ఫలితంగా అతడి ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు డీపీఎల్ యాజమాన్యం తెలిపింది. కాగా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడిన సమయంలోనూ హర్షిత్ రాణా ఇలాగే అతి చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ మయాంక్ అగర్వాల్‌ను అవుట్ చేయగానే ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ ఓవరాక్షన్ చేసి.. మూల్యం చెల్లించాడు.చదవండి: శుభవార్త పంచుకున్న హసీన్ జహాన్.. షమీపై మరోసారి తీవ్రమైన ఆరోపణలుBails are broken — Harshit Rana was there 🥶#DPL2025pic.twitter.com/VDnk39INji— KKR Karavan (@KkrKaravan) August 11, 2025 -
ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్‌కు బాంబు బెదిరింపులు
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. భారత్ తమ సైనిక చర్యలతో దాయాది దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇండియన్ ఆర్మీ.. డ్రోన్లు, క్షిపణులతో ఉగ్ర శిబిరాలు, సైనిక స్థావరాలపై దాడి చేస్తూ పాకిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బకొట్టింది.పాక్ కూడా సరిహద్దు వెంబడి తీవ్ర స్ధాయిలో కాల్పులకు తెగబడుతూ కవ్వింపు చర్యలకు దిగుతోంది. అంతేకాకుండా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ముఖ్య నగరాల్లో డ్రోన్ దాడికి యత్నించి పాక్ విఫలమైంది. ప్రస్తుతం ఇరు దేశాల్లోనూ యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. అరుణ్ జైట్లీ స్టేడియంను పేల్చివేస్తామని పేర్కొంటూ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) కు శుక్రవారం బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని డీడీసీఎ అధికారి ఒకరు ధ్రవీకరించారు."మీ స్టేడియంలో బాంబు పేలుడు జరుగుతుంది. భారత్‌లో పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ బ్లాస్ట్‌తో ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం తీర్చు కుంటామని" మెయిల్లో రాసి ఉన్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు. కాగా ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్‌గా ఉంది. ఈ అరుణ్ జైట్లీ స్టేడియం మే 11న గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ ఐపీఎల్-2025ను వారం రోజుల పాటు బీసీసీఐ తాత్కాలికంగా నిలిపివేసింది. -
IPL 2025: కేకేఆర్ ఈజ్ బ్యాక్.. ఢిల్లీపై గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్-2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తిరిగి పుంజుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేయగల్గింది. ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అక్షర్ పటేల్(43) ఫర్వాలేదన్పించాడు. వీరితో విప్రజ్ నిగమ్(19 బంతుల్లో 38) ఆఖరిలో మెరుపులు మెరిపించనప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, అనుకుల్ రాయ్,రస్సెల్, ఆరోరా తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్(36), గుర్భాజ్(26), నరైన్(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో కేకేఆర్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.చదవండి: IPL 2025: వావ్.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్ -
భారత కుర్రాళ్ల జోరు.. బంగ్లా పులుల బేజారు (ఫోటోలు)
-
భారత్‌లో మరో టీ20 లీగ్.. తొలి ఎడిషన్ అప్పటి నుంచే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. 2008లో మొదలైన ఈ టీ20 లీగ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్లో ఒక్కసారి ప్రతిభ నిరూపించుకుంటే ఆటగాళ్లపై కనకవర్షం కురవడం ఖాయం. అంతేకాదు.. ఇక్కడ ప్రతిభ చూపితే జాతీయ జట్టులోనూ చోటు దక్కించుకునే అవకాశాలు ఉంటాయి.ఇటీవలి కాలంలో యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ తదితరులు అలా టీమిండియాలో చోటు దక్కించుకున్న వాళ్లే. యంగ్ టాలెంట్ హంట్‌లో భాగంగా దేశవాళీ క్రికెట్, అండర్-19 టోర్నీల్లో ఆకట్టుకున్న ఆటగాళ్ల నుంచి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన వాళ్లను ఎంపిక చేసుకుంటాయి.ఇప్పటికే పలు స్థానిక లీగ్లుఈ క్రమంలో పలు రాష్ట్రాల క్రికెట్ బోర్డులు సైతం టీ20 లీగ్‌లు నిర్వహిస్తూ స్థానిక ఆటగాళ్ల ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే తమిళనాడు ప్రీమియర్ లీగ్, ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్, పంజాబ్ ప్రీమియర్ లీగ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ బోర్డు సైతం ఇదే బాటలో నడవాలని నిశ్చయించింది.ఢిల్లీ ప్రీమియర్ లీగ్ పేరిట టోర్నీని ఆరంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఆగష్టు 2024 ద్వితీయార్థ భాగంలో ఈ లీగ్‌ను మొదలుపెట్టనున్నట్లు పేర్కొంది. మ్యాచ్‌లన్నీ అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది.అదే స్పెషల్ ఇక్కడమిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఢిల్లీ తమ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించనుంది. ఈ టోర్నీలో పురుషులతో పాటు మహిళా జట్లకు కూడా అవకాశం ఇవ్వనుంది. మొత్తంగా 40 మ్యాచ్‌లు నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేస్తామని తెలిపిన డీడీసీఏ.. ఇందులో 33 మెన్, 7 వుమెన్ క్రికెట్ మ్యాచ్‌లు ఉంటాయని వెల్లడించింది.ఇక ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో మొత్తంగా ఆరు జట్లు(మెన్) ఉంటాయని.. వీటికోసం ఫ్రాంఛైజీలు రూ. 49.65 కోట్ల రూపాయాల మేర ఖర్చు చేయవచ్చని డీడీసీఏ తెలిపింది. ఇందులోని టాప్ 4 బిడ్డర్లు మహిళా జట్లను ఆటోమేటిక్‌గా కైవసం చేసుకుంటాయని పేర్కొంది. స్థానికంగా క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకే ఈ లీగ్ ఆరంభిస్తున్నట్లు తెలిపింది. -
IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ హోం మ్యాచ్‌లు విశాఖలో.. ఎందుకంటే..?
ఐపీఎల్ 2024 ఎడిషన్ తొలి విడత షెడ్యూల్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహకులు 17 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. ఈ లెగ్‌లో మొత్తం 21 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మార్చి 22న ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇంతవరకు టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. తొలి విడతలో డబుల్ హెడర్ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. డే గేమ్స్ మధ్యాహ్నం 3:30 గంటలకు.. నైట్ మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. కాగా, తొలి విడత షెడ్యూల్లో ఓ ఆసక్తికర విషయం అందరి దృష్టిని ఆకర్శించింది. అన్ని జట్లు తమ హోం గేమ్స్‌ను సొంత మైదానాల్లో ఆడుతుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే సొంత మైదానంలో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఆడుతుంది. ఇందుకు కారణంగా ఏంటని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో పురుషుల ఐపీఎల్ ప్రారంభానికి ముందు మహిళల ఐపీఎల్ జరుగనుంది. ఈ మైదానంలో మహిళల ఐపీఎల్ సెకెండ్ ఆఫ్ మ్యాచ్‌లతో పాటు ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లెక్కన పురుషుల ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇక్కడ 11 మ్యాచ్‌లు జరుగనున్నాయి. వరుస మ్యాచ్‌ల కారణంగా పిచ్ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో డీసీ యాజమాన్యం, బీసీసీఐ కలిసి సంయుక్తంగా వేదికను విశాఖకు తరలించేందుకు అంగీకరించారు. ప్రస్తుతానికి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ రెండు హోం గేమ్స్‌ను ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు ఢిల్లీలో కాకుండా విశాఖలో జరుగనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్.. మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్‌తో.. ఏప్రిల్ 3న కేకేఆర్‌తో విశాఖలో ఆడనుంది. ఇక రెండో విడతలో ఢిల్లీ ఆడాల్సిన ఐదు హోం గేమ్స్‌ను సొంత మైదానంలోనే ఆడుతుంది. ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. మొహాలీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో డీసీ టీమ్.. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. అనంతరం మార్చి 28న జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో (రాత్రి 7:30).. మార్చి 31న విశాఖ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో (రాత్రి 7:30).. ఏప్రిల్ 3న విశాఖ వేదికగా కేకేఆర్‌తో (రాత్రి 7:30) డీసీ తలపడనుంది. అన్ని అనుకూలిస్తే.. విశాఖలో రిషబ్ పంత్ మెరుపులు చూసే అవకాశం కూడా ఉంటుంది. పంత్ కారు ప్రమాదం తాలూకా గాయాల నుంచి పూర్తిగా కోలుకుని రానున్న ఐపీఎల్లో ఆడతాడని ప్రచారం జరుగుతుంది. -
CWC 2023 SA VS SL: శ్రీలంకను చిత్తు చేసిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా సెంచరీల మోత మోగించింది. ఈ రోజు (శనివారం) జరిగిన పోరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు శతక్కొట్టారు. క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. A stellar batting performance helps South Africa to a massive win in their #CWC23 clash against Sri Lanka 💪#SAvSL 📝: https://t.co/6P9uKyV5lF pic.twitter.com/LxZPnRHPKN — ICC Cricket World Cup (@cricketworldcup) October 7, 2023 అయితే 428 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రీలంక జట్టు విఫలమైంది. లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. నిస్సంక (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే కుశాల్ పెరీరా (7) కూడా ఔటయ్యాడు. ఇక ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్ మాత్రం తన ఆటతో శ్రీలంక జట్టు పై ఆశలు రేకెత్తించాడు. మొత్తం 8 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అనంతరం కగిసో రబడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ దశలో చరిత్ అసలంక, దాసున్ షనకలు కాసేపు జట్టు విజయం కోసం పోరాటం చేశారు. వీరిద్దరు తమ జోరు చూపించారు. ఆ సమయంలో శ్రీలంక లక్ష్యానికి చేరువయ్యే అవకాశం కనిపించింది. అయితే అసలంక, ఆ తర్వాత షనక ఔటవ్వడంతో 326 పరుగుల వద్దే శ్రీలంక కథ ముగిసింది. మొత్తానికి 102 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. స్కోర్లు: సౌతాఫ్రికా- 428, శ్రీలంక- 326 -
రిషబ్ పంత్ వచ్చేశాడు.. ఫోటోలు వైరల్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. హోంగ్రౌండ్ అయిన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడుతున్న మ్యాచ్‌కు రిషబ్ పంత్ హాజరయ్యాడు. ఫిజియో సాయంతో మ్యాచ్‌కు హాజరైన పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ డ్రెస్సింగ్ రూమ్ బయట కూర్చొని మ్యాచ్ వీక్షించాడు. పంత్‌ను చూసిన అభిమానులు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. మిస్ యూ పంత్.. RP 17 అంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. షార్ట్. వైట్ టీషర్ట్ వేసుకున్న పంత్ కర్ర సాయంతోనే మ్యాచ్‌కు వచ్చాడు. అభిమానులకు అభివాదం చేసిన పంత్ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్ వైపు చిరునవ్వుతో ఇచ్చిన లుక్స్ ఆకట్టుకున్నాయి. పంత్ రాకను మానిటర్లో గమనించిన సౌరవ్ గంగూలీ, హెడ్‌కోచ్ పాంటింగ్ సహా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతేడాది డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్న పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ మిస్ అవుతున్నట్లు ఇప్పటికే చాలాసార్లు పేర్కొంది. సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన తొలి మ్యాచ్‌కు డగౌట్లో పంత్ జెర్సీని డగౌట్లో ప్రదర్శించింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఇలా చేయడంపై బీసీసీఐ సీరియస్ అయింది. భౌతికంగా దూరమైనవారికే మాత్రమే అలాంటి గౌరవం ఇస్తారని.. పంత్ మనతోనే ఉన్నాడని.. ఇలాంటివి రిపీట్ చేయొద్దని హెచ్చరించింది. బీసీసీఐకి క్షమాపణ చెప్పిన ఢిల్లీ ఫ్రాంచైజీ ముందునుంచి చెప్పినట్లుగా పంత్‌ను స్టేడియానికి తీసుకొచ్చింది. మ్యాచ్‌లు ఆడకపోయినా పంత్ తమతో ఉంటే మాకు ధైరంగా ఉంటుందని పాంటింగ్ కూడా తెలిపాడు. Rishabh Pant acknowledges the crowd👋 #IPL2023 #DCvsGT #RishabhPant pic.twitter.com/YPsylllWN5 — CricTelegraph (@CricTelegraph) April 4, 2023 -
IPL 2023: హోంగ్రౌండ్లో ఢిల్లీ ఆడే మ్యాచ్‌లకు పంత్!
టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. యాక్సిడెంట్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు పంత్ దూరమయ్యాడు. అతను లేని లోటును మరో రకంగా (జట్టుతో పాటు డగౌట్లో అతను ఉండడం లేక అతని జెర్సీ నెంబర్ ఉన్న టీషర్ట్‌ను ఆటగాళ్లు ధరించేలా) తీర్చుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావించింది. ఈ మేరకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)రంగంలోకి దిగింది. పంత్‌కు అభ్యంతరం లేకపోతే.. ఢిల్లీ క్యాపిటల్స్ తమ హోం గ్రౌండ్ అయిన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడే మ్యాచ్‌లను వీక్షించేందుకు డగౌట్లో ప్రత్యేక ర్యాంప్‌ను ఏర్పాటు చేస్తామని డీడీసీఏ తెలిపింది. డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ మాట్లాడుతూ.. ''ఐపీఎల్ 16వ సీజన్ పంత్ ఆడకపోయినా డగౌట్లో ఉంటే బాగుంటుందని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది. అందుకే మేము ఒక ఆలోచన చేశాం. పంత్ గ్రౌండ్లో ఉంటే కంపర్ట్‌గా ఫీలవుతాడంటే అతని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. అతన్ని జాగ్రత్తగా చూసుకునేందుకు ప్రత్యేక మెడికల్ టీం సహా ఇంటి నుంచి స్టేడియానికి తీసుకురావడానికి ప్రత్యేక ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా కల్పిస్తాం. పంత్ దీనికి ఒప్పుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ డగౌట్లో అతని కోసం ప్రత్యేక ర్యాంప్‌ను ఏర్పాటు చేయనుంది.'' అని చెప్పుకొచ్చాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ కూడా పంత్ విషయమై తెగ ఫీలయ్యాడు. పంత్ లేని లోటు మాకు తెలుస్తుందని.. అతను ఐపీఎల్‌కు దూరమైనప్పటికి ఏదో ఒకలా అతను జట్టుతో పాటు ఉండేలా ప్లాన్ చేసుకుంటామని తెలిపాడు. అందుకు పంత్ జెర్సీ నెంబర్‌తో కూడిన టీషర్ట్లను ప్రత్యేకంగా తయారు చేయించి జట్టు మొత్తం ధరించేలా చూస్తామన్నాడు. అవసరమైతే పంత్‌ను డగౌట్లో కూర్చొబెట్టి మ్యాచ్‌లు వీక్షించే అవకాశం కల్పిస్తాం. అందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం అని పాంటింగ్ పేర్కొన్నాడు. తాజాగా డీడీసీఏ ప్రకటన పాంటింగ్ కలను నిజం చేసేలా కనిపిస్తుంది. గతేడాది డిసెంబర్లో రిషబ్ పంత్‌కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి లక్నో వస్తుండగా రూర్కీ సమీపంలో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పలు సర్జరీల అనంతరం పంత్ కోలుకుంటున్నాడు. ఫలితంగా దాదాపు తొమ్మిది నెలలు క్రికెట్‌కు దూరమయ్యాడు.యాక్సిడెంట్‌తో ఐపీఎల్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్‌కు కూడా దూరమయ్యే చాన్స్ ఉంది. ఇప్పటికే ఐపీఎల్‌కు దూరం కావడంతో పంత్ సేవలను ఢిల్లీ క్యాపిటల్స్ కోల్పోయింది. పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. వైస్‌కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యహరించనున్నాడు. ఇక ఐపీఎల్లో కెప్టెన్‌గా వార్నర్‌కు అనుభవంతో పాటు మంచి పేరు ఉంది. ఇక పంత్ స్థానంలో అభిషేక్ పోరెల్‌ను ఎంపిక చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది. ఏప్రిల్ ఒకటిన లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తమ మొదటి మ్యాచ్‌ను ఆడనుంది. చదవండి: IPL 2023: ఆ జట్టు బాగుంది.. ట్రోఫీ గెలిచే అవకాశాలు మెండు: రిక్కీ పాంటింగ్ IPL 2023: అర్థం కాని పిచ్‌లు.. పరుగుల వర్షం కష్టమేనట!


