
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్.. ఇప్పుడు ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాకింగ్స్‌లోనూ సత్తాచాటాడు. సిరాజ్ మియా తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్‌ను సాధించాడు. సిరాజ్ 674 రేటింగ్ పాయింట్లతో ఏకంగా 12 స్ధానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ హైదరాబాదీ టెస్టు బౌలర్ల ర్యాకింగ్స్‌లో టాప్ 15లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి.
దుమ్ములేపిన సిరాజ్..
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ భారత ఫాస్ట్ బౌలర్ సంచలన ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా ఓవల్ టెస్టులో టీమిండియా చారిత్రత్మక విజయం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఆఖరి టెస్టులో సిరాజ్ తొమ్మది వికెట్లు పడగొట్టి భారత్‌కు మరుపురాని విజయాన్ని అందించాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 23 సిరాజ్ వికెట్లతో సత్తాచాటాడు. ఇందులో రెండు ఫైవ్ వికెట్ల హాల్స్ కూడా ఉన్నాయి.
ప్రసిద్ద్ అదుర్స్..
ఇక ఓవల్ టెస్టులో సిరాజ్‌తో పాటు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ద్ కృష్ణ సైతం తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. ప్రసిద్ద్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 59వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్రసిద్ద్ ఐదో టెస్టులో మొత్తంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను కృష్ణ సాధించాడు. కాగా బౌలర్ల ర్యాకింగ్స్‌లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(889) అగ్రస్దానంలో కొనసాగుతుండగా.. కగిసో రబాడ రెండో స్దానంలో నిలిచాడు.
టాప్-5 లోకి జైశ్వాల్..
ఇక ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ టాప్ 5లోకి తిరిగొచ్చాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో జైశ్వాల్ అద్బుత సెంచరీతో మెరిశాడు. అదేవిధంగా ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలో విఫలమైన శుబ్‌మన్ గిల్ నాలుగు స్ధానాలు దిగజారి 13వ ర్యాంక్‌కు పడిపోయాడు.
చదవండి: IND vs ENG: వ్యాజ్‌లెన్ వాడారు.. గిల్ సేనపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు