
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ ఓ సస్పెన్ష్ థ్రిల్లర్ సినిమా ను తలపించింది. ఇరు జట్ల ఆటగాళ్ల తమ విరోచిత పోరాటాలతో అభిమానులకు అసలు సిసలైన టెస్టు క్రికెట్ మజాను అందించారు. ఆఖరివరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో విజయం ఇంగ్లండ్ జట్టునే వరించింది.
ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైనప్పటికి రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లు తమ పోరాటాలతో కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి నేను వున్నా అంటూ జడేజా బ్యాటింగ్ చేసిన తీరు.. అతడికి టెయిలాండర్లు(జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్) సహకరించిన విధానం గురుంచి ఎంతచెప్పుకొన్నతక్కువే.
విజయానికి 22 పరుగులు కావాల్సిన సమయంలో సిరాజ్ క్లీన్ బౌల్డ్ కావడంతో కోట్లమంది భారత అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. ఆఖరి వికెట్‌గా వెనుదిరిగిన సిరాజ్ సైతం మైదానంలోనే భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే లార్డ్స్ టెస్టులో ఓటమిపై టీమిండియా స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ ఆశ్విన్ తాజాగా స్పందించాడు. మ్యాచ్ ఆఖరి రోజు ఆట సందర్భంగా తన తండ్రితో జరిగిన సంభాషణ గురించి ఆశ్విన్ వివరించాడు. సిరాజ్ మూడు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను గెలిపిస్తాడని నమ్మకంతో తన తండ్రి ఉన్నట్లు ఆశ్విన్ వెల్లడించాడు.
"లార్డ్స్ టెస్టులో భారత్ పోరాడి ఓడింది. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం అద్బుతమైన స్పెల్‌ను బౌల్ చేశాడు. ఓవైపు అలసిన శరీరంతో మైదానంలో పోరడాతూనే స్టోక్స్ తన బౌలింగ్‌ను కొనసాగించాడు. ఆఖరి రోజు ఆటను మా నాన్న నేను కలిసి టీవీలో వీక్షించాము.
సిరాజ్ మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను ఫినిష్ చేస్తాడని మా నాన్న నాతో అన్నారు. వెంటనే నేను జోకులు ఆపండి అని ఆయనతో అన్నాను. అదేవిధంగా స్టోక్స్‌ను కూడా ఆయన ప్రశంసించారు. రెండు ఎండ్స్ నుంచి అద్బుతంగా బౌలింగ్ చేశాడని ఆయన కొనియాడారు.
తొలి ఇన్నింగ్స్‌లో కంటిన్యూగా 9.2 ఓవర్ల స్పెల్‌ను బౌలింగ్ చేసిన స్టోక్సీ.. రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్ల మ్యాచ్ విన్నింగ్ స్పెల్‌ను వేశాడు. అతడు 13-140 కిం కి.మీ. వేగంతో బౌలింగ్ చేశాడు. ఓవైపు భారత తరపున జడేజా అడ్డుగోడలా నిలిచి తన పోరాటాన్ని కొనసాగిస్తుంటే.. మరోవైపు స్టోక్స్ కూడా ఇంగ్లండ్ తరపున అదే పనిచేశాడు" అని తన యూట్యూబ్ ఛానల్‌లో జడ్డూ పేర్కొన్నాడు.
చదవండి: అత్యధికసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’లు అందుకుంది వీరే