
వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా (IND vs WI) బౌలర్లు అదరగొడుతున్నారు. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఫలితంగా శనివారం నాటి మూడో రోజు ఆటలో విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగులకే ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయింది.
162 పరుగులకే
రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా- వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్ వేదికగా గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ను 162 పరుగులకే ఆలౌట్ చేసింది. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) నాలుగు వికెట్లు పడగొట్టగా.. పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మూడు వికెట్లు దక్కించుకున్నాడు.
టీమిండియా భారీ స్కోరు
చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) రెండు వికెట్లు తీయగా.. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో.. భారత్ ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్ (100), ధ్రువ్ జురెల్ (125), రవీంద్ర జడేజా (104 నాటౌట్) శతకాల వల్ల ఇది సాధ్యమైంది.
220 పరుగులు వెనుకబడి
ఈ క్రమంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విండీస్.. భోజన విరామ సమయానికి 27 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 66 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఇంకా 220 పరుగులు వెనుకబడి ఉంది.
ఓపెనర్ తగ్‌నరైన్ చందర్‌పాల్ (8) రూపంలో సిరాజ్ తొలి వికెట్ అందించగా.. రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో మరో ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ (14), నాలుగో నంబర్ బ్యాటర్ బ్రాండన్ కింగ్ (5), వికెట్ కీపర్‌బ్యాటర్ షాయీ హోప్ (1)లను వెనక్కి పంపించాడు.
ఇక కుల్దీప్ యాదవ్.. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (1)ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. శనివారం లంచ్ బ్రేక్ సమయానికి వన్‌డౌన్ బ్యాటర్ అలిక్ అథనాజ్ 27, ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
చదవండి: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఏకైక ఆటగాడిగా..
#TeamIndia's fielding brilliance continues 👏
This time it's Yashasvi Jaiswal 👌
West Indies 5️⃣ down now!
Updates ▶ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank | @ybj_19 pic.twitter.com/5gKY0dXiVt— BCCI (@BCCI) October 4, 2025