
ది ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. తన సంచలన బౌలింగ్‌తో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సిరాజ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
సిరాజ్ సాధించిన రికార్డులు ఇవే..
👉ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. సిరాజ్ ఇప్పటివరకు ఇంగ్లండ్‌లో 46 టెస్టు వికెట్లు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉండేది.
కపిల్ దేవ్ తన టెస్టు కెరీర్‌లో ఇంగ్లండ్ గడ్డపై 43 వికెట్లు సాధించాడు. తాజా ఇన్నింగ్స్‌లో స్మిత్‌ను ఔట్ చేసి ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో జస్ప్రీత్ బుమ్రా(51), ఇషాంత్ శర్మ(51) సంయుక్తంగా ఆగ్రస్ధానంలో ఉన్నారు.
👉అదేవిధంగా ఇంగ్లండ్‌లో జరిగిన ఒక టెస్టు సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు (23) తీసిన బౌలర్‌గా బుమ్రా రికార్డును సిరాజ్ సమం చేశాడు. బుమ్రా 2021-22 పర్యటనలో ఇంగ్లండ్‌పై 23 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ మరో వికెట్ తీసి ఉంటే బుమ్రాను ఆధిగమించేవాడు.
👉వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ హిస్టరీలో అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన నాలుగో బౌలర్‌గా అక్షర్ పటేల్ రికార్డును సిరాజ్ సమం చేశాడు. అక్షర్ ఇప్పటివరకు 5 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించగా.. సిరాజ్ కూడా సరిగ్గా ఐదు సార్లు ఈ ఫీట్ సాధించాడు.
డబ్ల్యూటీసీలో అత్యధిక త్యధిక సార్లు ఫైవ్ వికెట్ హల్ సాధించిన బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా (12) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత అశ్విన్ (11), రవీంద్ర జడేజా (6) జడేజా కొనసాగుతున్నారు.ఇక ఈ సిరీస్‌లో సిరాజ్(23 వికెట్లు) లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
చదవండి: అతడొక సంచలనం.. ప్రాణం పెట్టి ఆడాడు! ఎంత చెప్పిన తక్కువే: గిల్