పొట్టి క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఫిబ్రవరి 7న తెరలేవనుంది. భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్‌లో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈసారి బరిలోకి దిగుతున్న.. అద్భుత ఫామ్‌తో ఈసారీ హాట్ ఫేవరెట్‌గా మారింది.
ఇక ఇప్పటికే మెగా టోర్నీకి భారత్ తమ జట్టును ప్రకటించింది. అదే జట్టుతో స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. మూడు విభాగాల్లోనూ ఆటను మెరుగుపరచుకుంటూ ప్రత్యర్థి జట్లకు కఠిన సవాలుగా మారింది సూర్య సేన.
అభిషేక్ శర్మ కాదు!..
ఈ నేపథ్యంలో మెజారిటీ మంది మాజీ క్రికెటర్లు ఈసారి టీమిండియా సెమీస్ చేరడం ఖాయమని.. టైటిల్ పోరుకు కూడా అర్హత సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ స్టార్ స్పోర్ట్స్ షోలో భాగంగా.. టాప్ రన్ స్కోరర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీమెంట్ అవార్డుల విజేతల గురించి తన అంచనాలు తెలియజేశాడు.
ఈసారీ అతడే టాప్!
గత ఎడిషన్ మాదిరే ఈసారి కూడా టీమిండియా పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలుస్తాడని చహల్ పేర్కొన్నాడు. ఇక భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను టాప్ రన్ స్కోరర్‌గా అంచనా వేసిన యుజీ.. ఈసారి అత్యధిక సిక్సర్లు బాదేది అతడే అని పేర్కొన్నాడు.
భారత్- పాక్ ముఖాముఖి పోటీ
అదే విధంగా.. టాప్ వికెట్ టేకర్‌గా బుమ్రాకు పట్టం కట్టాడు చహల్. ఇక ఈ మెగా టోర్నీలో తాను భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్న చహల్.. జట్ల అత్యధిక స్కోరును 240 పరుగులుగా అంచనా వేశాడు. కాగా కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న భారత్- పాక్ ముఖాముఖి తలపడతాయి.
ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల చహల్ 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అయితే, ఈ టోర్నీలో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా బెంచ్‌కే పరిమితం అయ్యాడు. మరోవైపు.. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన బుమ్రా.. ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి పదిహేను వికెట్లు కూల్చాడు. టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
చదవండి: WC 2026: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్


