T20 WC 2026: సిరాజ్‌కు గోల్డెన్‌ ఛాన్స్‌! | Reports Says Mohammed Siraj To Replace Injured Harshit Rana In India T20 WC 2026 Squad, Read Story For Details | Sakshi
Sakshi News home page

T20 WC 2026: సిరాజ్‌కు గోల్డెన్‌ ఛాన్స్‌!

Feb 6 2026 4:14 PM | Updated on Feb 6 2026 5:42 PM

Siraj to replace injured Harshit Rana in India T20 WC 2026 squad: Report

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ ఆరంభానికి ముందు భారత జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఫాస్ట్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే దుస్థితి నెలకొంది. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ధ్రువీకరించాడు.

కాగా శనివారం (ఫిబ్రవరి 7) నుంచి వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. భారత్‌- శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ఈ ఐసీసీ టోర్నీలో టీమిండియా శనివారం నాటి మ్యాచ్‌లో యూఎస్‌ఏతో తలపడుతుంది. ఇందుకు ముంబైలోని వాంఖడే మైదానం వేదిక. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) శుక్రవారం మీడియాతో మాట్లాడాడు.

భారీ ఎదురుదెబ్బే
ఈ సందర్భంగా హర్షిత్‌ రాణా గాయం గురించి అప్‌డేట్‌ అందిస్తూ. ‘‘హర్షిత్‌ టోర్నీ నుంచి తప్పుకొన్నాడని ఇప్పుడే చెప్పలేను. అయితే, అతడి పరిస్థితి ఏమాత్రం బాలేదు. గాయంపై స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది.

ఒకవేళ హర్షిత్‌ రాణా టోర్నీకి దూరమైతే నిజంగా మాకు అది భారీ ఎదురుదెబ్బే. కాంబినేషన్లను దృష్టిలో పెట్టుకునే మేము పదిహేను మందిని ఎంపిక చేసుకున్నాం. అయితే, కావాల్సినంత బెంచ్‌ స్ట్రెంత్‌ ఉంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఆల్‌రౌండరే అక్కర్లేదు
అతడి స్థానంలో ఆల్‌రౌండర్‌నే తీసుకురావాలనే నిబంధన ఏమీ లేదు’’ అని ప్రి-మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో సూర్య పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో హర్షిత్‌ రాణా స్థానంలో హైదరాబాదీ స్టార్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ప్రపంచకప్‌ జట్టులోకి రానున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

సిరాజ్‌కు గోల్డెన్‌ ఛాన్స్‌!
కాగా 2024 జూలైలో సిరాజ్‌ చివరగా టీమిండియా తరఫున టీ20 బరిలో దిగాడు. అయితే, గతేడాది ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున సిరాజ్‌ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. పదిహేను మ్యాచ్‌లలో కలిపి 16 వికెట్లు తీశాడు. కాగా సిరాజ్‌ ఇప్పటికి టీమిండియా తరఫున మొత్తంగా 16 మ్యాచ్‌లు ఆడి పద్నాలుగు వికెట్లు తీశాడు.

ఇదిలా ఉంటే.. హర్షిత్‌ రాణా స్థానంలో సిరాజ్‌కు బదులు ప్రసిద్‌ కృష్ణను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది ఐపీఎల్‌లో 25 వికెట్లతో టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు ప్రసిద్‌. ఈ కర్ణాటక బౌలర్‌ చివరగా 2023లో టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌ ఆడాడు. 

చదవండి: ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభానికి ముందు ఆసీస్‌కు మరో భారీ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement