సిరాజ్ సూపర్ బాల్‌.. రోహిత్ మైండ్ బ్లాంక్‌! వీడియో వైర‌ల్‌ | Mohammed Siraj dismisses Rohit Sharma with a stunning delivery | Sakshi
Sakshi News home page

IPL 2025: సిరాజ్ సూపర్ బాల్‌.. రోహిత్ మైండ్ బ్లాంక్‌! వీడియో వైర‌ల్‌

Mar 29 2025 11:03 PM | Updated on Mar 30 2025 12:18 PM

Mohammed Siraj dismisses Rohit Sharma with a stunning delivery

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియ‌న్స్ స్టార్ ఓపెన‌ర్ వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ విఫ‌ల‌మ‌య్యాడు. సీఎస్‌కేతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో డ‌కౌటైన రోహిత్ శ‌ర్మ‌.. ఇప్పుడు అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌పై అదే తీరును క‌న‌బ‌రిచాడు. కేవ‌లం 8 ప‌రుగులు మాత్ర‌మే చేసి హిట్‌మ్యాన్ ఔట‌య్యాడు. 

గుజ‌రాత్ స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ అద్బుత‌మైన బంతితో రోహిత్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ముంబై ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్.. వ‌రుస‌గా రెండు బంతుల్లో బౌండ‌రీలు బాది మంచి టచ్‌లో క‌న్పించాడు. కానీ సిరాజ్ అదే ఓవ‌ర్‌లో ఐదో బంతిని రోహిత్‌కు ఆఫ్ స్టంప్ దిశ‌గా గుడ్ లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు. ఆ బంతిని రోహిత్ శ‌ర్మ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. 

కానీ బంతి అద్బుతంగా ట‌ర్న్ అయ్యి బ్యాట్‌, ప్యాడ్ మ‌ధ్య‌లో నుంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో రోహిత్ ఒక్క‌సారిగా బిత్త‌ర‌పోయాడు. రోహిత్‌ను ఔట్ చేసిన వెంటనే సిరాజ్ క్రిస్టియానో ​​రొనాల్డో వింటేజ్ ''కాల్మా స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ తర్వాత ర్యాన్ రికెల్టన్‌ను కూడా సిరాజ్ బోల్తా కొట్టించాడు. కాగా మహ్మద్ సిరాజ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement