PC: BCCI
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ నాయకత్వం వహించనుండగా, సి.వి. మిలింద్ వైస్ కెప్టెన్‌గా (డిప్యూటీ) ఎంపికయ్యాడు. తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, ఎం. అభిరత్ రెడ్డి వంటి ప్రముఖ ప్లేయర్లకు ఈ జట్టులో చోటు దక్కింది.
ఎలైట్ గ్రూప్-బిలో ఉన్న హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్‌లో త్రిపురతో (అక్టోబర్ 11-14) తలపడనుంది. అనంతరం విజయనగరం వేదికగా జరిగే రెండో మ్యాచ్‌లో ఆంధ్ర జట్టును ఢీకొట్టనుంది. అయితే ఈ మొదటి రెండు మ్యాచ్‌లకు మాత్రమే సిరాజ్ అందుబాటులో ఉంటాడు. ఆ తర్వాత అతడు న్యూజిలాండ్ పర్యటన కోసం భారత జట్టుతో కలిసి వెళ్లనున్నాడు.
మరోవైపు కల్నల్ సి.కె. నాయుడు ట్రోఫీలో రైల్వేస్ (అక్టోబర్ 12), ఉత్తరాఖండ్ (అక్టోబర్ 19) జట్లతో తలపడే అండర్-23 జట్టును కూడా హెసీఎ ప్రకటించింది. ఈ జట్టుకు పేరాల అమన్ రావు నాయకత్వం వహించనుండగా, ఆరోన్ జార్జ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
హైదరాబాద్ రంజీ జట్టు
మహ్మద్ సిరాజ్ (కెప్టెన్), సి.వి. మిలింద్ (వైస్-కెప్టెన్.), తన్మయ్ అగర్వాల్, అభిరత్ రెడ్డి, రాహుల్ సింగ్, హిమ తేజ, రాహుల్ రాధేష్ (వికెట్ కీపర్), సాయి ప్రగ్నయ్ రెడ్డి (వికెట్ కీపర్), వరుణ్ గౌడ్, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి, రక్షన్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, రుతిక్ యాదవ్ మెండే, సాయి వికాస్ రెడ్డి.
హైదరాబాద్ అండర్-23 జట్టు
అమన్‌రావు (కెప్టెన్), ఆరోన్ జార్జ్ (వైస్ కెప్టెన్), ఎ. అవనీష్ రావ్ (వికెట్ కీపర్), రాఘవ్ పట్టాపు, వాఫీ కచ్చి, ఎ. విఘ్నేష్ రెడ్డి, సుంకరి ధీరజ్ (వికెట్ కీపర్), ఆర్. సాయి శరణ్, ప్రణవ్ వర్మ, మురుగన్ అభిషేక్, కుష్ అగర్వాల్, నిశాంత్ మహోద్‌లీ, డినేష్. రాహుల్. కార్తికేయ.
చదవండి: IND vs NZ: టీమిండియాకు కొత్త కెప్టెన్?


