
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ(Mohammed Siraj) తన సహనాన్ని కోల్పోయాడు. రెండో రోజు ఆట సందర్భంగా ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌తో సిరాజ్ వాగ్వాదానికి దిగాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బెన్ డకెట్(94), జాక్ క్రాలీ(84) అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు 166 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.
కానీ ఇంగ్లండ్ ఓపెనర్లు మాత్రం వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్‌ను బెన్ డకెట్ ఓ ఆట ఆడేసికున్నాడు. అతడి బౌలింగ్‌లో బౌండరీలు బాదుతూ డకెట్ పరుగులు రాబట్టుకున్నాడు.
ఈ క్రమంలో తన ప్రశాంతతను కోల్పోయిన సిరాజ్.. డకెట్‌తో గొడవపడ్డాడు. ఏదో విషయంలో డకెట్ అంపైర్‌కు ఫిర్యాదు చేస్తుండగా బౌలింగ్ ఎండ్‌లో సిరాజ్ తన నోటికి పనిచెప్పాడు. వేలు చూపిస్తూ అతడిపై సీరియస్ అయ్యాడు. అందుకు బదులుగా డకెట్ సైతం మాటల యుద్దానికి దిగాడు.
అంపైర్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సిరాజ్ భయ్యా ఇది అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా డకెట్‌తో సిరాజ్ గొడవపడడం ఇది తొలిసారి కాదు. లార్డ్స్ టెస్టులో డకెట్‌ను అవుట్ చేసిన తర్వాత అతిగా సెలబ్రేట్ చేసుకున్నందుకు మహమ్మద్ సిరాజ్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా ఐసీసీ విధించింది. ఇప్పుడు కూడా అదేవిధంగా సిరాజ్ ప్రవర్తిస్తుండడంతో ఐసీసీ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశముంది. కాగా మాంచెస్టర్ టెస్టులో ఇప్పటివరకు 10 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్.. వికెట్ ఏమీ తీయకుండా 58 పరుగులు సమర్పించుకున్నాడు.
Tempers flared between Ben Duckett and M. Siraj. 🔥#ENGvIND 👉 4th TEST, DAY 2 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/Y3btplYguV pic.twitter.com/MmTP86rXNU
— Star Sports (@StarSportsIndia) July 24, 2025