చరిత్ర సృష్టించిన మహ్మద్‌ సిరాజ్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా | Mohammed Siraj Creates History, Breaks Mitchell Starcs Record For Most Test Wickets In 2025, Read Full Story | Sakshi
Sakshi News home page

IND vs WI: చరిత్ర సృష్టించిన మహ్మద్‌ సిరాజ్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Oct 2 2025 1:23 PM | Updated on Oct 2 2025 2:35 PM

Mohammed Siraj Creates History, Breaks Mitchell Starcs Record;

అహ్మదాబాద్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. తొలి ఇన్నింగ్స్ అత‌డి బౌలింగ్ ధాటికి విండీస్ టాపార్డ‌ర్ కుదేలు అయ్యింది. ఆరంభంలోనే ఓపెన‌ర్ తేజ్‌నార‌య‌న్ చంద్ర‌పాల్‌ను ఔట్ చేసిన సిరాజ్ మియా.. ఆ త‌ర్వాత కింగ్‌, అథ్‌నాజ్‌, ఛేజ్ వంటి కీల‌క వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 11 ఓవ‌ర్లు బౌలింగ్ సిరాజ్ 34 ప‌రుగులు ఇచ్చి నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ మ్యాచ్‌లో బంతితో మ్యాజిక్ చేసిన సిరాజ్ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది డ‌బ్ల్యూటీసీ జ‌ట్ల‌లో అత్య‌ధిక టెస్టు వికెట్లు వికెట్లు ప‌డ‌గొట్టిన బౌల‌ర్‌గా సిరాజ్ చ‌రిత్ర సృష్టించాడు.

2025లో సిరాజ్ ఇప్పటివరకు 31 వికెట్లు తీశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉండేది. స్టార్క్ ఈ ఏడాదిలో 29 టెస్టు వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌లో అథ్‌నాజ్‌ను ఔట్ చేసిన సిరాజ్ మియా.. స్టార్క్‌ను అధిగమించాడు. అదేవిధంగా డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27లో సిరాజ్(27) లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో అతడు 23 వికెట్లతో సత్తాచాటాడు.

2025లో అత్యధిక టెస్ట్ వికెట్లు(డబ్ల్యూటీసీ జట్లలో)
మహ్మద్ సిరాజ్-31
మిచెల్ స్టార్క్- 29 
షామర్ జోసెఫ్ -24
నాథన్ లియాన్- 22
జోష్ టంగ్ -21
చదవండి: AB de Villiers: ఆసియాకప్‌ ట్రోఫీ వివాదం.. టీమిండియాపై డివిలియర్స్‌ విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement