న్యూజిలాండ్‌తో ఆదివారం ఇండోర్ వేదికగా సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో తాడో పేడో తెల్చుకోవడానికి భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. మరోవైపు కివీస్ కూడా భారత గడ్డపై మరోసారి చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది.
ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌ను వరల్డ్‌కప్ ఫైనల్‌లా భావిస్తున్నామని సిరాజ్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిరీస్‌లో రెండు జట్లు సమవుజ్జీలగా ఉన్నాయి. గత పర్యటన మాదిరిగానే భారత జట్టుకు కివీస్ గట్టీ పోటీ ఇస్తుంది. అందుకే సిరాజ్ ఆఖరి వన్డేను ప్రపంచకప్ ఫైనల్‌తో పోల్చాడు.
భారత్‌లో మాకు ఇటువంటి పరిస్థితులు చాలా అరుదుగా ఎదురవుతుంటాయి. మొన్న సౌతాఫ్రికా, నేడు న్యూజిలాండ్. చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాము. ఈ మ్యాచ్ మాకు దాదాపు ప్రపంచ కప్ ఫైనల్ లాంటిది. జట్టులోని సీనియర్లు యువ ఆటగాళ్లకు చాలా మద్దతుగా ఉన్నారు. వారు నుంచి మాకు సలహాలు, సూచనలు అందుతున్నాయి.
దీంతో డ్రెసింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. మేము మొదటి మ్యాచ్ గెలిచాం. దురదృష్టవశాత్తూ రెండో వన్డేలో ఓడిపోయాం. కాబట్టి ఇప్పుడు మాపై కాస్త ఒత్తిడి ఉంది. రాజ్‌కోట్ వన్డేలో డారిల్ మిచెల్ అవుట్ చేసేందుకు అన్ని విధాలంగా ప్రయాత్నించాము. కానీ ఒక క్యాచ్ డ్రాప్ కావడం వల్ల మ్యాచ్ పరిస్థితి మారిపోయింది.
అతడు స్పిన్‌ను ఎదుర్కొనే తీరు, సింగిల్స్ తీస్తూ బౌలర్లపై ఒత్తిడి పెంచే విధానం నిజంగా అద్భుతం. మా బౌలింగ్ గురుంచి ఎలాంటి ఆందోళన లేదు. జట్టులో ప్రతీ ఒక్కరు పాజిటివ్ మైండ్‌తో ఉన్నారు. సిరీస్ డిసైడర్‌లో తప్పక గెలుస్తాము" అని సిరాజ్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు!


