ప్రియురాలిని చంపి.. ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు! | Boyfriend tried to summon Indore MBA students spirit after murdering her: Cops | Sakshi
Sakshi News home page

Indore Horror: ప్రియురాలిని చంపి.. ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు!

Feb 17 2026 4:32 AM | Updated on Feb 17 2026 8:28 AM

Boyfriend tried to summon Indore MBA students spirit after murdering her: Cops

మధ్యప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో ఓ ఎంబీఏ విద్యార్దిని త‌న ప్రియుడి చేతిలో దారుణ హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ఓ సంచల‌న విష‌యం బ‌య‌ట‌కు వచ్చింది. హత్య చేసిన తర్వాత ఆమె ఆత్మతో మాట్లాడేందుకు నిందితుడు తాంత్రిక పూజలు చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. .

అస‌లేమి జ‌రిగిందంటే?
24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని ఫిబ్రవరి 11(మంగ‌ళ‌వారం) సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తన స్నేహితుల బర్త్‌డే పార్టీకి వెళ్తున్నానని, రాత్రి 11.00 గంటలకు వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పింది. కానీ ఎప్ప‌టికి తిరిగి రాక‌పోవ‌డంతో ఆమె తండ్రి పోలీసుల‌కు మిస్సింగ్ కంప్లీట్ ఇచ్చాడు. 

ఇదే సమయంలో ఆమె మొబైల్ నెంబర్ నుంచి అభ్యంతరకర ప్రైవేట్‌ వీడియో తన కాలేజ్ వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్ అయింది. కాలేజీ యాజమాన్యం ఆ వీడియోను వెంటనే డిలీట్ చేశారు. ఆ వీడియోలో క‌నిపించ‌కుండా పోయిన యువతితో పాటు మ‌రో యువకుడు ఉన్నాడు. అత‌డే ఆమె క్లాస్‌మేట్, ప్రియుడు పీయూష్ ధనోటియా. వీరిద్ద‌రూ  గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. 

పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తెస్తుండగా, పీయూష్ నిరాకరించేవాడు. ఇదే విషయంలో ఫిబ్రవరి 12న ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంలో పీయూష్ ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. ఆ త‌ర్వాత నిందితుడు మహారాష్ట్రలోని పన్వేల్‌కు పారిపోయాడు. అక్కడ ఒక హోటల్‌లో ఉంటూ యూట్యూబ్‌లో "ఆత్మలను ఎలా పిలవాలి?" అని వెతికి, కుంకుమ, గాజులు, పసుపుతో తాంత్రిక పూజలు నిర్వహించాడు. చనిపోయిన తన ప్రియురాలి ఆత్మతో మాట్లాడాలని అతను ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

వెలుగులోకి వచ్చింది ఇలా..
ఇండోర్‌లోని ద్వారకాపురి ప్రాంతంలో పీయూష్ ధనోటియా అద్దెకు ఉండేవాడు. అక్క‌డే వారిద్ద‌రూ క‌లిసేవారు. అయితే హ‌త్య చేసిన త‌ర్వాత ఆమె మృతదేహాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ద్దె గది నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా, యువతి మృతదేహం నగ్నంగా మంచంపై పడి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement