బాగా చూసుకోక పోతే నీ మర్యాదను బజారుకు ఈడ్చుతా..! | Jyotish Kamalakar Bhat Suchitra Case Incident, Woman Allegedly Honey Trapped Lover, Used Videos For Blackmail | Sakshi
Sakshi News home page

బాగా చూసుకోక పోతే నీ మర్యాదను బజారుకు ఈడ్చుతా..!

Feb 11 2026 11:41 AM | Updated on Feb 11 2026 11:51 AM

Jyotish Kamalakar Bhat Suchitra Case Incident

యశవంతపుర(బెంగుళూరు): ఉత్తర కన్నడ జిల్లా కారవార సిద్ధాపురలో వసంత నాయక్‌ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రియుడు కమలాకర భట్‌ను నిందితురాలు సుచిత్ర హనీట్రాప్‌ చేసి బెదిరించిన విషయం వెలుగులోకి వచ్చింది. హనీట్రాప్‌ చేసిన విషయాన్ని భర్త మహేశ్‌ నాయక్‌ వెల్లడించారు. జ్యోతిష్యుడు కమలాకర భట్‌ను సుచిత్ర హనీట్రాప్‌ చేయటంతో పాటు ప్రైవేట్‌ వీడియో రికార్డ్‌ చేసుకుని బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు ఆరోపించారు. 

కమలాకర్‌ భట్‌ సుచిత్రకు దగ్గర అయిన తరువాత ప్రైవేట్‌ వీడియోలను రికార్డ్‌ చేసుకుంది. పిల్లలు, తాను నీ జతలోనే ఉంటామని కమలాకర భట్‌తో చెప్పి, తమను బాగా చూసుకోవాలని డిమాండ్‌ చేసింది. బాగా చూసుకోక పోతే నీ మర్యాదను బజారుకు ఈడ్చుతానంటూ కమలాకర భట్‌ను బెదిరించినట్లు సమాచారం. మర్యాద పోతుందనే భయంతో సుచిత్ర, ఆమె పిల్లలను కమలాకర భట్‌ తన వద్దనే ఉంచుకున్నాడు. ఈ విషయాన్ని తన కుమార్తెలు చెప్పినట్లు మహేశ్‌ నాయక్‌  విలేకరులకు వెల్లడించారు. 

ఫస్ట్‌లుక్‌కు రూ.10 వేలు.. 
సుచిత్ర బుట్టలో పడిన కమలాకర్‌ భట్‌.. ఫస్ట్‌ లుక్‌లో రూ.36 వేలు చెల్లించాడు. ఫస్ట్‌లుక్‌లో రూ.10 వేలు వస్తే చాలు అనుకున్న సుచిత్రకు ఒక్కసారిగా 36 వేలు రావడంతో సంతోష పడింది. ఇందులో ఆమె వేతనం కింద రూ.25 వేలు, షాపింగ్‌కు రూ.10 వేలు తీసుకున్నట్లు సుచిత్రా భర్త మహేశ్‌ నాయక్‌ చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement