పోలీసుల‌కు చిక్కిన హెచ్‌సీయూ ల్యాప్‌టాప్ దొంగ‌లు | Gachibowli police arrest 3 in University of Hyderabad laptop theft case | Sakshi
Sakshi News home page

పోలీసుల‌కు చిక్కిన హెచ్‌సీయూ ల్యాప్‌టాప్ దొంగ‌లు

Feb 16 2026 11:16 PM | Updated on Feb 17 2026 9:08 AM

Gachibowli police arrest 3 in University of Hyderabad laptop theft case

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ల్యాప్‌టాప్స్‌ను చోరీ చేసిన దొంగ‌ల‌ను  గచ్చిబౌలి పోలీసులు ప‌ట్టుకున్నారు. సీఆర్  రావు ఎఐఎమ్ఎస్ ప్రాంగణంలో జరిగిన ఈ చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తం దొంగిలించిన 60 ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కూకట్‌పల్లికి చెందిన రేగుల చంద్రశేఖర్ (30) తో పాటు, సాయి చరణ్ (19), అశ్విన్ రావు (19) అనే ఇద్దరు విద్యార్థులు కలిసి ఈ దొంగ‌తానానికి పాల్పడిన‌ట్లు గచ్చిబౌలి ఇన్ స్పెక్టర్ బాలరాజు తెలిపారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వీరిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఆయ‌న‌ పేర్కొన్నారు. కాగా పటిష్ట బందోబస్తు ఉండే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫిబ్రవరి 8న రాత్రి దొంగతనం జరగడం రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

ఈ ఘటనపై ఈ నెల 9న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ సెక్షన్లు 331(4), 305(ఎ) కింద కేసు నమోదు చేశారు.  ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement