
మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్ వంటి ఎలక్ట్రానిక్స్ మన దేశంలో కంటే కొన్ని ఇతర దేశాల్లో కొంత తక్కువ ధరకే లభిస్తాయని, చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఇది నిజమే అని ఓ వ్యక్తి నిరూపించి చూపించాడు. ఈ విషయాన్ని వివరంగా తన రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు.
''నేను మ్యాక్‌బుక్ కొనడానికే భారతదేశం నుంచి వియత్నాంకు వెళ్లాను'' అనే శీర్షికతో ఆ వ్యక్తి తన అనుభవాన్ని పూర్తిగా వివరించాడు. మీరు మ్యాక్‌బుక్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే వియత్నాంకు ఓ చిన్న ట్రిప్ వేసుకోండని కూడా సలహా ఇచ్చాడు.
నేను కొంత తక్కువ ధరలోనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని హనోయ్‌కి (వియత్నాం రాజధాని) చేరుకున్నాను. మ్యాక్‌బుక్ కొనడానికి సమీపంలోని ప్రాంతాలలో 15 కంటే ఎక్కువ షాపులను సందర్శించాను. ల్యాప్‌టాప్ కోసం వెళ్లి 11 రోజులు వెకేషన్ ఎంజాయ్ చేసాను. మొత్తానికి రూ. 1.48 లక్షలకు మ్యాక్‌బుక్ కొనేసాను.
ఇండియాలో మ్యాక్‌బుక్ ధర రూ. 1.89 లక్షలు. కార్డ్ ఆఫర్‌లతో రూ. 1.85 లక్షలు. అయితే వియత్నాంలో రూ. 1,48,500లకు కొనుగోలు చేసాను. దీంతో రూ. 36,500 ఆదా అయింది. అంటే ఇది దాదాపు రౌండ్ ట్రిప్ టికెట్ ధర. మొత్తం మీద ల్యాప్‌టాప్ ఖర్చుతో సహా, ప్రయాణానికి దాదాపు రూ.2.08 లక్షలు ఖర్చు అయింది. ట్యాక్స్ వంటివి వాపసు వచ్చిన తరువాత ఖర్చు రూ. 1.97 లక్షలు. ఇందులో మ్యాక్‌బుక్ ధరను తీసివేస్తే.. ఆ వ్యక్తి వియత్నాం తిరిగిరావడానికి అయిన ఖర్చు అని తెలుస్తోంది.
ఇదీ చదవండి: అందని జీతం.. ఫుట్‌పాత్‌పై పడుకున్న టీసీఎస్ ఉద్యోగి
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. మొత్తానికి ఇండియాలో మ్యాక్‌బుక్ కొనుగోలు చేయడానికి పెట్టే డబ్బుతో.. మ్యాక్‌బుక్ కొనుగోలు చేయడమే కాకుండా వియత్నాం కూడా చూసి వచ్చేసాడు. అయితే రెండు లేదా మూడు మ్యాక్‌బుక్స్ కొనాలనుకునే వారికి ఇంకా ఎక్కువ ఆదా అవుతుందని కొందరు చెబుతున్నారు.
I flew to Vietnam from India just to buy a MacBook
byu/Shuict inmacoffer