అడవుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు, ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయని మరోసారి నిరూపించింది ఒక చిన్న ప్రాణి. గత మూడు దశాబ్దాలుగా కనుమరుగైందనుకున్న ‘మౌస్ డీర్’, మళ్లీ అడవిలో నడుస్తూ కనిపించింది. ఇటీవలి రోజుల్లో వియత్నాం అడవుల్లో శాస్త్రవేత్తలు దీనిని కెమెరాల్లో గుర్తించారు. ముప్పై ఏళ్లుగా దాని జాడ కనిపించకపోవడంతో, శాస్త్రీయ రికార్డుల్లో ఏ ఆధారమూ లేకపోవడంతో, ఇది పూర్తిగా అంతరించిపోయిందని అందరూ నమ్మేశారు.
కాని ప్రకృతి ఎప్పుడూ తన ప్రణాళికలను చివరి నిమిషంలోనే బయటపెడుతుంది. అన్నట్లు, అలా ఒక్కసారిగా సర్‌ప్రైజ్‌లా ప్రత్యక్షమైంది ఈ చిన్న జీవి. ప్రపంచంలోనే అతి చిన్న కాళ్లున్న, గొర్రెల కుటుంబానికి చెందిన ఈ మౌస్ డీర్ బరువు పది కిలోలు. అడవుల లోతుల్లో, వెలుగుకు దూరంగా జీవించే స్వభావం వల్ల దీని ఉనికి తెలుసుకోవడం అంత సులువు కాదు. అందుకే ఇన్ని ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించడమే ఒక అరుదైన అద్భుతం.


