ప్రతిరోజూ ఫ్యాషన్లో ఒక చిన్న అడ్వెంచర్! అదితిరావు స్టేట్మెంట్ యిల్! ఇందుకోసం, తను ఫాలో *అయ్యే చిన్న చిన్న స్టయిల్ హ్యాక్స్, స్పార్కింగ్ టిప్స్ ఏంటో ఇక్కడ చూడండి!
కొత్త ఆభరణాలు, కొత్త లుక్స్
ఇవన్నీ ప్రయత్నించడానికి నేను ఎప్పుడూ వెనుకాడను. ఫ్యాషన్‌లో కొత్తదనం భయాన్ని కాకుండా, ఉత్సాహాన్ని ఇస్తుంది. నిజమైన మెరుపు ఆభరణాల్లో కాదు, వాటిని ధరించే మన వైబ్‌లోనే ఉంటుంది.
– అదితిరావు హైదరీ
జుంకాల మ్యాజిక్!
చెవులకు వేసుకునే ఆభరణాల్లో ఎన్నో రకాలున్నా, సంప్రదాయ అందాన్ని క్లాసీగా చూపించడంలో ఆక్సిడైజ్డ్ జుంకాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా పెద్ద డోమ్ ఆకారంలో మెరిసే ఈ జుంకాలు, మొత్తం లుక్‌ను మరింత అందంగా మార్చేస్తాయి. ఎక్కువగా ఇలాంటి జుంకాలు రంగురంగుల దారాలు, మిర్రర్ వర్క్‌తో ఉండే కుర్తాలు, డీప్ జ్యూల్ టోన్స్‌లో ఉన్న అనార్కలీలకు అద్భుతంగా సరిపోతాయి. కళ్లకు సాఫ్ట్ కాజల్, నేచురల్ మేకప్, చిన్న బొట్టు ఇవన్నీ కలిస్తే ఆభరణాల అందం మరింత మెరిసిపోతుంది.
హెయిర్ స్టయిల్ సింపుల్‌గా వదిలి, మెడను బోసిగా ఉంచడం చాలా ముఖ్యం, అప్పుడే ఈ జుంకాలు హైలైట్ అవుతాయి. చేతులకు దుస్తుల రంగులకు తగ్గట్టు బీడెడ్ బ్రేస్‌లెట్‌లు లేదా చిన్న ట్రెడిషనల్ గాజులు వేసుకుంటే మొత్తం స్టయిల్‌కు కలర్‌ఫుల్ టచ్ వస్తుంది. ఫెస్టివల్స్, ఫ్యామిలీ ఫంక్ష¯Œ ్స, కల్చరల్ ఈవెంట్స్ ఇలా ఎక్కడైనా ఇలాంటి జుంకాలు వేసుకుంటే, మీరు ప్రత్యేకంగా కనిపించడం ఖాయం!
∙దీపిక కొండి


