స్టీల్‌ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్‌ సుంకం | India imposed five year anti dumping duty hot rolled steel products from Vietnam | Sakshi
Sakshi News home page

స్టీల్‌ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్‌ సుంకం

Nov 14 2025 8:56 AM | Updated on Nov 14 2025 8:56 AM

India imposed five year anti dumping duty hot rolled steel products from Vietnam

వియత్నాం నుంచి వచ్చే చౌక స్టీల్‌ దిగుమతులను కట్టడి చేసేందుకు కేంద్ర సర్కారు యాంటీ డంపింగ్‌ డ్యూటీ విధించింది. హాట్‌ రోల్డ్‌ స్టీల్‌ ఉత్పత్తులు టన్నుపై 121.55 డాలర్ల సుంకాన్ని ప్రకటించింది. చౌక ఉత్పత్తుల నుంచి దేశీ తయారీదారులను కాపాడేందుకు ఈ చర్య తీసుకుంది.

డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమిడీస్‌ (డీజీటీఆర్‌) సిఫారసు మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఐదేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. చౌక దిగుమతులపై దర్యాప్తు చేయాలన్న దేశీ పరిశ్రమ చేసిన వినతి మేరకు డీజీటీఆర్‌ విచారణ చేసి, యాంటీ డంపింగ్‌ డ్యూటీ విధింపునకు సిఫారసు చేసింది. భారత్‌–వియత్నాం మధ్య 2023–24లో ద్వైపాక్షిక వాణిజ్య 14.81 బిలియన్‌ డాలర్లుగా ఉంది. భారత్‌ 5.47 బిలియన్‌ డాలర్ల విలువ మేర ఎగుమతులు  చేసింది.

ఇదీ చదవండి: బాలల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement