సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు జరిమానా విధించింది. రాష్ట్ర న్యాయసేవా ప్రాధికార సంస్థకు రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది. వారం లోపు చెల్లించాలని స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. జంట జలాశయాల సమీపంలో నిర్మాణాలపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా, గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
చివరి అవకాశం ఇచ్చినప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు జరిమానా విధించింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి 2 వారాల గడువు ఇచ్చిన హైకోర్టు.. తదుపరి విచారణ 30వ తేదీకి వాయిదా వేసింది.


