సాక్షి, కొమరం భీమ్: తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. తర్వాతి స్థానంలో బీఆర్‌ఎస్, ఇతరులు, ఆ తర్వాతే బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. ఈ తరుణంలో..
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో ఆసక్తికర ఎన్నిక జరిగింది. ఒక్క ఓటు తేడాతో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించిందక్కడ. కెరమెరి మండలంలోని పరందోలి గ్రామ సర్పంచిగా స్వతంత్ర అభ్యర్థి రాథోడ్ పుష్పలత.. కేవలం ఒక్క ఓటు తేడాతో ప్రత్యర్థి అభ్యర్థి దిలీప్ కాటేపై గెలిచారు. దీంతో ఆమె కుటుంబ సభ్యల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రంగులు చల్లుకుంటూ.. స్వీట్లు పంచుకుంటూ సంబురాలు చేసుకుంటున్నారక్కడ.


